అమావాస్యకు, పౌర్ణమికి రాజకీయాలు చేస్తే ప్రజలకు ఏం గుర్తుంటారు. ఎప్పుడూ ప్రజల్లోనే ఉండేవారినే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. అయితే ఒక్కసారిగా బద్దలై.. నెలలుగా స్తబ్దుగా ఉండే అగ్నిపర్వతంలా ప్రవర్తిస్తున్నారు విజయశాంతి అని కొందరు విమర్శిస్తున్నారు. తాజాగా మరోసారి బద్దలై లావా చిందించారు.
రాములమ్మా అలియాస్ విజయశాంతి పార్టీలు మారడంలో దిట్ట అన్న విమర్శ ఉంది. ‘‘ఆమెకు ఒక నియోజకవర్గం లేదు. ఆమెకు పెద్ద రాజకీయ నాయకులు తెలియదు.. ఎక్కువగా పరిచయాలు లేవు. కానీ సినిమా గ్లామర్ ఉందని ఏదో మాట్లాడుతోంది. రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే ప్రజలు గుర్తిస్తారు. గెలిపిస్తారు. కానీ ఇలా ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తూ తర్వాత నెలపాటు విశ్రాంతి తీసుకొని మరోసారి భగ్గుమన్నట్టు మాట్లాడేస్తూ కాలం గడిపేస్తోంది. ఇలా పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తే ఎవరు గుర్తిస్తారు?’’ అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
తాజాగా తెలంగాణ మంత్రి ఆడియో ఒకటి వైరల్ అయ్యింది. ఓ రియల్ వెంచర్ లో కమీషన్ ఇవ్వాలని మాట్లాడిన ఆ మంత్రి మాటలు దుమారం రేపాయి. అలాగే బెంగళూరులో డ్రగ్స్ కేసులో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేల పేర్లు వినిపించడం కలకలం రేపింది. వీటిపైనే రాములమ్మ బయటకు వచ్చి నిప్పులు చెరిగారు. ఆ మంత్రిని తొలగించే దమ్ము కేసీఆర్ కు ఉందా? ఆ ఎమ్మ్లెల్యేలను సస్పెండ్ చేస్తారా? అంటూ సవాల్ చేశారు విజయశాంతి.
అయితే టీఆర్ఎస్ లో ఒకప్పుడు పనిచేసి బయటకు వెళ్లిపోయిన విజయశాంతి కామెంట్లపై అటు కేసీఆర్, కేటీఆర్ నుంచి ఏ మంత్రి, ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదు. ఆమె గొంతుచించుకున్నా కానీ ఒక్కరు కౌంటర్ ఇవ్వడం లేదు. పార్ట్ టైం పాలిటిక్స్ చేసే విజయశాంతి కామెంట్లకు స్పందించి అనవసరంగా ఆమెను పైకి లేపడం తప్పితే మరొకటి లేదని వారంతా డిసైడ్ అయ్యారా? అని చర్చ జరుగుతోంది.