పెద్దాయన మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉండి ఇపుడు అతి పెద్ద చిచ్చు రాజేశారు. ఫలితంగా తన కుమారుడు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ రాజకీయ భవిష్యత్తుని ఇరకాటంలో పడేశారు. దీని వల్ల వైసీపీ పని మరింత సులువు అయింది అంటున్నారు. వసంత క్రిష్ణ ప్రసాద్ పనితీరు ఏ మాత్రం బాలేదని ఇప్పటికే సర్వే నివేదికలు వెల్లడిస్తున్న వేళ ఆయన పరిచయాలు అన్నీ కూడా టీడీపీ గూటిలోవే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ వైసీపీ ఏం చేయాలో పెద్దాయన వసంత నాగేశ్వరావు చెప్పి మరీ దారి చూపించారు అని అంటున్నారు.
నిజానికి మైలవరంలో బీసీలు ఎక్కువ. వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది అని ప్రచారంలో ఉంది. దానికి తగినట్లుగా వైసీపీ అడుగులు వేసేందుకు వసంత నాగేశ్వరరావు పెద్ద్ నోరు చేసుకుని తమ సొంత కులం మీటింగులో మాట్లాడిన మాటలు మంటనే పుట్టించాయి. కమ్మలకు ఏపీలో ఏమీ గౌరవం లేదని ఆయన అనడమే కాదు జగన్ మీద డైరెక్ట్ గానే కామెంట్స్ చేసారు. పైగా జగన్ వద్దనుకునే అమరావతినే బెస్ట్ రాజధాని అంటూ కితాబు ఇచ్చారు.
ఇలా కమ్మగా రాగాలు వసంత నాగేశ్వరరావు ఆలపించడమే కాకుండా బ్రహ్మానందరెడ్డి వైఎస్సార్, నీలం సంజీవరెడ్డి వంటి వారి పేరు మీదనే ఏపీలో ఎన్నో నిర్మాణాలు ఉన్నాయని కమ్మలకు తీరని అన్యాయం ఏపీలో వైసీపీ చేస్తూంటే ఎవరూ నోరు మెదపకపోవడమేంటి అని కుల రాజకీయాన్ని చేస్తూ నిలదీశారు. మొత్తానికి వసంత నాగేశ్వరరావు ఆక్రోశం కాదు కానీ కొడుకు రాజకీయ జీవితంలో చిచ్చు పెట్టేశారు అని అంటున్నారు
మైలవరంలో ఇసుక దందా జరుగుతోందని, ఎటు చూసినా పెద్ద ఎత్తున భూకబ్జాలు పెరిగిపోయాయని ఇప్పటికే టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎన్నో సార్లు విమర్శలు చేశారు. ప్రభుత్వం కూడా వాటి మీద నిజానిజాలు అన్నీ రెడీ చేసి దగ్గరపెట్టుకుంది అంటున్నారు. ఇక వసంత క్రిష్ణ ప్రసాద్ తెలుగుదేశం నేతలతోనే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు అన్న సమాచారం ఉందని అంటున్నారు.
అప్పట్లో ఆయన ఇంటికి మాజీ ఎంపీ లగడపాటి రాజపోగాల్ రావడం, అంతా కలసి అల్పాహరం చేయడం కూడా సంచలనం రేపింది. అది మర్యాదపూర్వక భేటీ అయినా వసంత ఫ్యామిలీ ఎంత రాజకీయాలకు అతీతమైన స్నేహాన్ని ప్రకటించుకున్నా వైసీపీ అధినాయకత్వం వాటిని ఆ కోణంలో చూడదు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే కచ్చితంగా గెలుస్తారు అనుకుంటే క్రిష్ణ ప్రసాద్ విషయంలో ఏదైనా రెండవ ఆలోచన ఉండేదని, ఆయన పట్ల జనంలో అసంతృప్తి ఉందని, దాంతో ఈసారి టికెట్ డౌట్ అని అంటున్నారు. ఈ క్రమంలో వసంత నాగేశ్వరరావు మా దారి వేరు అన్నట్లుగా మాట్లాడం, తెలుగుదేశానికి మద్దతుగా మాట్లాడడంతో జూనియర్ వసంతకు టికెట్ గండం పొంచి ఉంది అని అంటున్నారు. పైగా కమ్మలను పక్కన పెట్టి బీసీలకు ఆ సీటు ఇస్తే దాన్ని గొప్పగా చెప్పుకోవచ్చు. సామాజిక సమీకరణలు కూడా మైలవరంలో బాగా కుదురుతాయి.
దాంతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా సైలెంట్ గా ఉంటూనే మైళవరం సీటు విషయంలో వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసింది అని అంటున్నారు. ఆ నియోజకవరంలో టికెట్ ని బీసీలకు ఇవ్వడం ద్వారా కమ్మలను సైడ్ చేసినట్లుగా కనిపించకుండానే చేయాల్సింది చేస్తుంది అని చెబుతున్నారు. ఇక టీడీపీలోకి చూస్తే వసంత ఫ్యామిలీ వెళ్లలేదు. అక్కడ దేవినెని ఉమామహేశ్వరరావు ఉన్నారు. మరి రెండింటికీ చెడిన చందంగా వసంత ఫ్యామిలీ మారుతోందా అంటే దానికి పెద్దాయన నాగేశ్వరరావే సమాధానం చెప్పాలని అంటున్నారు.
మొత్తానికి కమ్మ వారి కార్తీక సమారాధన కాదు కానీ మైలవరం సీటుకే దెబ్బేసింది అని అంటున్నారు. కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక పోయింది అన్న చందాన కమ్మలను అన్యాయం అని గొంతు చించుకుంటే తమ ఇంట్లోనే సీటు పోతోందని కూడా వసంత ఫ్యామిలీ లేట్ గా తెలుసుకుని బావురుమన్నా వైసీపీ అధినాయకత్వం ముందు అసలు కుదిరే వ్యవహారం కానే కాదని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.