1962 లో 31 రోజుల పాటూ జరిగిన భారత్- చైనా యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చివరికి విజయం చైనాను వరించినా జవాన్ల మరణంతో రెండు దేశాలకు తీవ్ర నష్టం సంభవించింది. ఆ తర్వాత జరిగిన చర్చల్లో రెండు దేశాలు ఇకపై కాల్పులు జరుపుకోవద్దని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ఒక ఒప్పందం చేసుకున్నాయి. సరి హద్దులో కాల్పులకు దిగుతూ పాక్ రెచ్చ ఎప్పుడూ రెచ్చగొడుతుంటోంది. కానీ ఈ 45 ఏళ్ల కాలంలో భారత్ - చైనా మధ్య ఎప్పుడూ కాల్పులు జరగలేదు. గత కాంగ్రెస్ హయాంలో ఎల్ఏసీ వద్ద పలుమార్లు ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నా ఇరు దేశాల సైనికుల మధ్య తోపులాటలు జరిగాయి. కొన్ని నెలల కిందట గాల్వన్ లోయలో చైనా కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో 20 మందికి పైగా భారత జవాన్లు దుర్మరణం చెందారు.భారత్ సైనికుల దాడిలో కొంతమంది చైనా జవాన్లు కూడా చనిపోయారు.
అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా కాల్పులు జరుపుకోలేదు.
తాజాగా సరిహద్దుల్లో రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత జవాన్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు దిగారని చైనా ఆరోపణలు చేసింది. చైనా సైన్యం సైనిక శిబిరం వైపుగా గాల్లోకి కాల్పులు జరిపిందని భారత ఆర్మీ పేర్కొంది. ఈ లెక్కన మొదటి సారి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్ పడ్డట్లే. యుద్దానికి సన్నద్ధం అవుతున్న చైనా ఇప్పటికే తూర్పు లద్ధాక్ సహా పలు ప్రాంతాల్లో సైనిక స్థావరాలు నిర్మిస్తోంది. ఉద్దేశ్య పూర్వకంగానే చైనా భారత్ ను రెచ్చగొడుతోందని చెబుతున్నారు.