తెలంగాణ రాష్ట్రానికి కీర్తికిరీటం హైదరాబాద్ అయితే.. అందులో కీలకం హైటెక్ సిటీ.. అక్కడున్న ఐటీ కంపెనీలు. అయితే.. తాజాగా ఐటీ కంపెనీల్లో కొన్ని కంపెనీలు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెలవులు ఇవ్వకపోవటం కనిపిస్తోంది. ఏళ్లకు ఏళ్లు.. కష్టపడి.. వందలాది మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం.. ప్రభుత్వ.. ప్రైవేటు కార్యాలయాలకు సెలవును ప్రకటించారు.
మీడియా..ఆసుపత్రి లాంటి కీలక సేవలు అందించే విభాగాల వారు.. పరిహారం కింద జీతాన్ని చెల్లించేలా ఉద్యోగుల్ని పని చేయించుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే.. సైబరాబాద్ పరిధిలోని పలు ఐటీ కంపెనీలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెలవు ఇవ్వకపోవటం గమనార్హం.
కంపెనీల తీరుపై పలువురు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తటమే కాదు.. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. సెలవు రోజు కొన్ని ఐటీ కంపెనీలు పని చేస్తున్న వైనం ముఖ్యమంత్రి కేసీఆర్ చెవిన పడితే ఆయన ఆగ్రహం చెందటం ఖాయమంఉన్నారు. అయినా.. కొన్ని ఐటీ కంపెనీల కక్కుర్తి కాకపోతే.. ఆవిర్భావ దినోత్సవం రోజున సెలవు ఇవ్వకపోవటం ఏమిటి?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/