చీఛీ..ఇలాంటి యాత్ర‌లు అవ‌స‌ర‌మా బాబు!

Update: 2015-10-20 14:16 GMT
పేరు కోసం మాత్ర‌మే కొంద‌రు ప‌నులు చేస్తుంటారు. అలాంటి వారి వ‌ల్ల పేరు సంగ‌తి త‌ర్వాత‌.. లేనిపోని అప‌కీర్తి మూట‌గ‌ట్టుకోవ‌ట‌మే కాదు న‌లుగురు ముందు న‌వ్వుల‌పాలైపోవ‌టం ఖాయం. ఇలాంటి వాటి విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని భావిస్తున్న రాజ‌ధాని శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం కోసం అత్యుత్సాహంతో పార్టీ నేత‌లు కొంద‌రు చేస్తున్న కార్య‌క్ర‌మాలు బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇవాల్టి రోజున మ‌సి పూసి మారేడు కాయ చేయ‌టం లాంటి వాటి వ‌ల్ల ఉన్న పేరు పోవ‌ట‌మే కాదు.. కామెడీగా మార‌టం ఖాయం. అలాంటి ప‌నే ఒక‌టి వీడియో రూపంలో వ‌చ్చేసి తెలుగు త‌మ్ముళ్ల‌ను తెగ ఇబ్బంది పెట్టేస్తోంది.

అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం కావ‌టానికి తెలుగుదేశం పార్టీ ఐటీ విభాగానికి చెందిన కొంద‌రు ఏపీ క్యాపిట‌ల్ రైడ్ పేరుతో సైకిల్ యాత్ర స్టార్ట్ చేయ‌టం తెలిసిందే. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ ద‌గ్గ‌ర ప్రారంభ‌మైన ఈ యాత్ర‌కు తెలుగుదేశం నేతలు హాజ‌రై జెండా ఊపి మ‌రీ స్టార్ట్ చేశారు.

త‌ల‌కు హెల్మెట్లు పెట్టి.. ప‌క్కా ప్రొఫెష‌న‌ల్స్ మాదిరి క‌నిపించిన వారంతా మాంచి ఊత్సాహంతో క‌నిపించ‌టం.. ఇలాంటివి మ‌రింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయ‌న్న సంబ‌రానికి తెలుగు త‌మ్ముళ్లు.. సీమాంద్రులు కొంద‌రు సంతోష‌ప‌డితే.. అస‌లు విష‌యం తెలిసిన త‌ర్వాత అవాక్కు అవుతున్న ప‌రిస్థితి.

రాజ‌ధానిలో ఘ‌నంగా సైకిల్ యాత్ర షురూ చేసి.. న‌గ‌ర‌శివారులోకి వ‌చ్చిన వెంట‌నే ఒక లారీలో సైకిళ్లు వేసేసి.. ఏసీ బ‌స్సులో ఎక్కేసి సేద తీర‌టం.. మ‌రో ఊరు మొద‌ట్లో సైకిళ్లు కింద‌కు దించి క‌ష్ట‌ప‌డిపోవ‌టం..లాంటి చిత్ర‌మైన ప‌ని చేశారు. ఇదంతా మీడియా కెమేరాకు దొరికిపోయారు. ఎంత ప్ర‌చారం కోస‌మైతే మాత్రం మ‌రీ ఇంత ఛీప్‌ గా చేస్తారా? అన్న విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అదేంటి బాబు.. త‌మ్ముళ్ల ప్లానింగ్ ఇంత దారుణంగా ఉంది..?
Tags:    

Similar News