రసికప్రియులకు కరోనా గుడ్ న్యూస్ ఇదీ

Update: 2020-03-14 21:30 GMT
చైనాలో సోకిన కరోనా వైరస్(కోవిడ్-19) ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా పేరు చెబితేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4వేలకు పైగా మృత్యువాతపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షన్నరకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా ఎఫెక్ట్ తో ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందోనని భయపడుతున్న వారికి పోర్న్ హబ్ గుడ్ న్యూస్ తెలిపింది. తమ సైట్లోని ప్రిమీయమ్ కంటెంట్ ను ఫ్రీగా నెలరోజులు చూడొచ్చని ప్రకటించింది. దీంతో రసికప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

చైనాలో సోకిన కరోనా ప్రస్తుతం 120దేశాల్లో విస్తరించింది. గత రెండువారాల్లో చైనా వెలుపలి దేశాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాను తేలికగా తీసుకోవద్దని అప్రమత్తంగా లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తుంది. తాజాగా కరోనా వైరస్ ఇటలీని భయపెడుతోంది. కరోనాతో ఇప్పటికే 1000మందికిపైగా ఇటలీలో మృత్యు వాతపడినట్లు తెలుస్తోంది. ఇటలీ ప్రభుత్వం కరోనా నిర్మూలనకు సీరియస్ చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యం లో పోర్న్ హబ్ ఇటలీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

కరోనా ఎఫెక్ట్ తో ఇటలీ ప్రభుత్వం ప్రజలందరినీ గృహ నిర్భందం లో ఉండాలని ఆదేశించింది.ఇంట్లోంచి కాలు బయట పెట్టవద్దని ఆంక్షలు విధించింది. దీంతో ఖాళీగా ఉన్న ఈ జనాలకు పోర్న్ హబ్ వల విసిరి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇటలీలో పోర్న్‌హబ్‌ సైట్‌ ప్రీమియమ్‌ కంటెంట్‌ను నెలరోజులు ఫ్రీగా చూడొచ్చని ప్రకటించింది. అలాగే పోర్న్ హబ్ తన ఉదారతను కూడా చాటుకుంది. ‘పోర్న్‌హబ్‌’ అనుబంధ సైట్‌ ‘మోడల్‌ హబ్‌కు మార్చి నెలలో వచ్చే ఆదాయాన్ని కరోనా బాధితుల సాయంకోసం అందించనున్నట్లు ప్రకటించింది.

పోర్న్‌హబ్‌ను సైట్ వీస్తున్న టాప్‌ 20దేశాల్లో ఇటలీ 7వ స్థానంలో ఉందని ఓ సర్వేలో వెల్లడించింది. కరోనా అందరికీ బ్యాడ్ న్యూస్ పంచుతుంటే.. ఇటలీవాసులకు మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా ఎఫెక్ట్ ను ఫోర్న్ హబ్ సైట్ సందేట్లో సడేమియాలా ఇలా వాడుకొని అందరిని దృష్టిని ఆకర్షించడం గమనార్హం.


Tags:    

Similar News