విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగినట్లు స్పష్టమైంది. కోడి కత్తితో దాడి అంటూ ఇష్యూ తీవ్రత తగ్గించేలా కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు తప్పన్న విషయం తాజాగా రుజువైంది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగింది కత్తితో దాడి కాదని.. ముమ్మాటికి హత్యాయత్నమేనని రిమాండ్ నోట్ స్పష్టం చేస్తోంది.
శ్రీనివాస్ కు సంబంధించిన రిమాండ్ నోట్ ను ఒక ప్రముఖ మీడియా సంస్థ చేజిక్కించుకుంది. ఇందులో ఉన్న అంశాలు చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురి కావటమే కాదు.. షాక్ తినటం ఖాయం.
రిమాండ్ నోట్‌లో ఉన్న అంశాలు చూస్తే..కత్తితో జరిగిన దాడి భుజం మీద కాకుండా మెడ భాగంలో తగిలి ఉంటే.. ఆయన అక్కడే చనిపోయి ఉండేవారని పేర్కొన్నారు.జగన్ ను హత్య చేసేందుకే శ్రీనివాసరావు ప్రయత్నించినట్లుగా రిమాండ్ నోట్ లో పేర్కొనటం గమనార్హం.
దాడి సమయంలో అదృష్టవశాత్తు వైఎస్ జగన్ కుడివైపునకు తిరిగారని.. దీంతో హత్యాయత్నం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ వచ్చేందుకు పార్టీ నేతలతో కలిసి వీఐపీ లాంజ్ లో ఎదురు చూస్తున్న జగన్ ను సెల్ఫీ నెపంతో వచ్చిన శ్రీనివాసరావు పదునైన కత్తితో హత్యాయత్నానికి తెగబడ్డారని పేర్కొన్నారు. శ్రీనివాస్ దాడి చేసే సమయంలో జగన్ పార్టీ నేత కరణం ధర్మశ్రీ సెల్ఫీ తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఆ సమయంలోనే శ్రీనివాస్ జగన్ పై హత్యాయత్నం చేశారని.. అయితే.. జగన్ కుడివైపునకు తప్పుకోవటంతో పెను ప్రమాదం తప్పినట్లు పేర్కొన్నారు. జగన్ పై హత్యాయత్నం జరిగినప్పుడు ఏపీ ప్రోటోకాల్ ఇన్ స్పెక్టర్ వాసుదేవ్ కూడా ఘటనాస్థలంలోనే ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. సానుభూతి కోసమే జగన్ మీద దాడి చేశానంటూ శ్రీనివాస్ చెబుతున్న మాటలకు.. రిమాండ్ నోట్ లో పేర్కొన్న అంశాలకు సంబంధం లేకుండా ఉండటం గమనార్హం.