తెలిసిన విషయాలకు శాస్త్రీయతతో సంబంధం లేకుండా తమ తెలివిని జోడించి వాదనలు వినిపించటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. కరోనా వేళలో ఇది మరింత ఎక్కువైంది. కరోనా విషయంలో తెలిసింది చాలా తక్కువ.. తెలియంది చాలా ఎక్కువ. కానీ.. చాలామంది కరోనాను విశ్లేషించటమే కాదు.. దాని చుట్టూ ఉన్న పలు అంశాలపై బల్లగుద్ది మరీ వాదిస్తుంటారు.
ఇలాంటి వాటిల్లో నిజాలు ఎంత? అన్న విషయంపై సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఒక ఇష్యూ మీద కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ వైద్యులు శ్రీనాథ్ రెడ్డి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షులుగా వ్యవహరించిన ఆయన కరోనాకు సంబంధించిన పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాల్ని చూస్తే.. అందరూ మాట్లాడుకునే అంశాల్లోని తప్పుల్ని ఆయన ఎత్తి చూపారని చెప్పాలి.
కరోనా మొదటి.. రెండో వేవ్ కారణంగా హెర్డ్ ఇమ్యూనిటీ బాగా పెరిగిపోయిందని థర్డ్ వేవ్ కారణంగాపెద్ద మప్పు ఉండదంటూ కొందరు వాదనలు వినిపిస్తున్నారు. అయితే.. హర్డ్ ఇమ్యూనిటీ కారణంగా కరోనా వ్యాపించదన్న వాదనలో నిజం లేదంటున్నారు. హర్డ్ ఇమ్యూనిటీ అన్నది వ్యాక్సిన్ కారణంగా రావాలే కానీ.. సహజంగా అది కూడా వైరస్ సంక్రమణం వల్ల రాదని చెబుతున్నారు. దీనికి కొన్ని ఉదాహరణల్ని చెబుతున్నారు శ్రీనాథ్ రెడ్డి.
సిరో సర్వే చేసినప్పుడు అహ్మదాబాద్ లాంటి నగరాల్లో 70 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లుగా తేలినప్పటికి.. మహమ్మారి ఉందనే చెబుతున్నారు. బ్రెజిల్ లో 76 శాతం మందిలో యాంటీ బాడీస్ కనిపించిన తర్వాత కూడా మహమ్మారి కొనసాగిందని.. అదే దేశంలో సలానా అనే ప్రాంతంలో 50 శాతం మందికి వ్యాక్సిన్ వేసినంతనే కరోనా మరణాలు 55 శాతానికి తగ్గిపోయినట్లు ఆయన చెప్పారు.
సహజసిద్ధమైన ఇన్ ఫెక్షన్ వల్ల హర్డ్ ఇమన్యూనిటీ వస్తుందనటానికి ఎలాంటి రుజువులు లేవని.. వ్యాక్సిన్ 60 శాతం పూర్తి అయితే దాని ప్రభావం చాలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్ లో వ్యాక్సినేషన్ 50 శాతం దాటిన తర్వాత మరణాలు సున్నాకు చేరుకున్నాయని గుర్తు చేశారు. హర్డ్ ఇమ్యూనిటీ అన్నది సమూహంలో ఉన్నంత కాలం బాగానే ఉంటుంది. రక్షణ లభిస్తుంది. కానీ.. వేరే చోటుకు వెళ్లినప్పుడు మాత్రం రక్షణ లభించదని చెప్పారు.
హర్డ్ ఇమ్యూనిటీని మరింత బాగా అర్థమయ్యేలా ఆయన ఒక ఉదాహరణను చెప్పుకొచ్చారు. పదవిలో ఉన్న రాజకీయ నేతకు చుట్టై భద్రతా సిబ్బంది రక్షణ ఉంటుంది. అదే వ్యక్తికి పదవి పోయిన తర్వాత అంతకు ముందున్న సెక్యురిటీ ఉండదు. ఒకవిధంగా చెప్పాలంటే అరువుగా తెచ్చి పెట్టుకున్నదే హెర్డ్ ఇమ్యూనిటీ. దాని మీద ఆధారపడకుండా వ్యాక్సిన్ వేయించుకోవటం ద్వారామన లోపలి సెక్యురిటీ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హెర్డ్ఇమ్యూనిటీ గురించి వాదనలు వినిపించే వారు.. ఈ ప్రముఖుడి మాటల్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం.