అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనా డొనాల్డ్ ట్రంప్ పై అక్కడి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గడం లేదు. తాజాగా ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ కు చేదు అనుభవం ఎదురైంది. హవాయి దీవుల్లో క్రిస్మస్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి జెట్‌బ్లూ ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తున్న ఇవాంకాను.. తోటి ప్యాసెంజర్ అందరి ముందూ తిట్టడం గమనార్హం. ''తాను ప్రయాణిస్తున్న విమానంలోనే ఇవాంకాను చూసిన ఆ ప్రయాణికుడు.. ఓ మై గాడ్.. ఇదో పీడకల అని అన్నాడు. వీళ్లు దేశాన్ని నాశనం చేశారు.. ఇప్పుడు మన ఫ్లైట్‌ను కూడా నాశనం చేస్తారు" అని అతడు అన్నట్లు మరో ప్రయాణికుడు షెఫ్ చెప్పారు. దీంతో ఎయిర్ లైన్స్ నిర్వాహకులు అతన్ని వెంటనే విమానం నుంచి కిందికి దించేశారు.
అయితే దీనిపై జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ వివరణ ఇచ్చింది. ఓ ప్రయాణికుడిని విమానంలో నుంచి దించేయడం చిన్న విషయం ఏమీ కాదని, అతన్ని మరో విమానంలో గమ్యస్థానానికి చేరుస్తామని జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇవాంకా తన భర్త జేరెడ్ కుష్నెర్ తో కలిసి హవాయికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఇవాంకాను వేధించిన ఆ ప్రయాణికుడి వివరాలు మాత్రం ఎయిర్ లైన్స్ వెల్లడించలేదు. ఈ ఘటన గురించి ఇవాంకా ముందు సీట్లోనే కూర్చున్న షెఫ్ అనే ప్రయాణికుడు వివరించాడు. ఇవాంకాను చూడగానే ఆ వ్యక్తి వణికాడని, వీళ్లు మన దేశాన్ని నాశానం చేశారు.. ఇప్పుడు ఫ్లైట్ ను నాశనం చేస్తారని అన్నట్లు చెప్పాడు. ఆమెను చూసి నిరసన తెలిపినా.. అతను అరవలేదని తెలిపాడు. ఈ ఘటనపై ట్రంప్ టీమ్ ఇంకా స్పందించలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/