అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ కూతురు - వైట్ హౌస్ సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్ కి ట్విట్టర్ యూజర్లు.. అదిరిపోయే షాక్ ఇచ్చారు. ఇన్ స్టాగ్రామ్ - ట్విట్లర్‌లో తనను పొగుడుతూ.. మెచ్చుకుంటూ తనకు తన అభిమానులు పంపిన అనేక సందేశాలు - ఉత్తరాలు - ఫొటోలను చూసి మురిసిపోతున్న ఇవాంకాకు.. అదే ట్విట్టర్ లో యూజర్లు అదిరిపోయే కామెంట్లతో షాకిచ్చారు. దీంతో ఇవాంక ఒక్కసారిగా నివ్వెరపోయిందట.
విషయంలోకి వెళ్తే.. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కి అటు నెట్ సహా ఇటు ట్విట్టర్ - ఫేస్ బుక్ వంటి వాటిలో ఫాలోయింగ్ ఎక్కువ. ఇక, ఇందులో పనిచేసేవారు కూడా ప్రతి ఒక్కరూ ట్విట్టర్ అకౌంట్ మెయింటెన్ చేస్తూ.. తమ తమ పనితీరుపై ప్రజలు - అభిమానుల నుంచి రేటింగ్ పొందుతూ ఉంటారు. ఈక్రమంలోనే వైట్ హౌస్ సీనియర్ సలహాదారు ఇవాంకా ట్రంప్ కూడా తన పేరుతో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి.. అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది ఇవాంక అభిమానులు ఫొటోలు - లేఖలు - సందేశాలు పంపారు. వీటిలో తన పనితీరుపైనా కామెంట్లు ఉండడంతో ఇవాంక మురిసిపోయింది. తన సంతోషాన్ని అదే ట్విట్టర్ ద్వారా పంచుకుంది కూడా.
ఆ లేఖలు - సందేశాలు చదువుతూ తాను ఎంతగా మురిసిపోయిందీ ఈ అగ్రరాజ్యం అధినేత కుమార్తె పూసగుచ్చినట్టు వివరిస్తూ.. ఆనందంతో మునిగిపోయింది. అయితే, మరికొందరు ట్విట్టర్ యూజర్లు మాత్రం ఇవాంకకు భారీ షాక్ ఇచ్చారు. ఆమె అభినయం - హావభావాలను వెక్కి రించారు. ఇవాంక రికమండేషన్ ద్వారా ఆ ఉద్యోగం పొందిందని, ఆమెకు ఎందుకు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. చురకలు సైతం అంటించారు. మరికొందరు ఇవాంకాకు వచ్చిన లేఖలు, సందేశాలను దగ్గరగా నిశితంగా పరిశీలించారు.
ఈ క్రమంలోనే అన్ని లేఖలు మిస్ ఇవాంక ట్రంప్ అనే అడ్రస్ - ఒకే విధమైన మార్కర్ పెన్నుతో వచ్చాయంటూ గేలి చేశారు. ఇంకా కొందరైతే, అసలు కృతజ్ఞతలు చెప్పడానికి కారణమేమిటి? ఆమేమీ అధికారికంగా ఎన్నిక కాలేదు కదా ? అని తీవ్రంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలోనే వైట్ హౌస్ నుంచి బయటికి వచ్చేయండంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఫేక్ ప్యాన్ మెయిల్స్ అంటూ మరికొందరు ఆక్షేపిస్తున్నారు. లేఖల్లో ఉన్న కొన్ని అక్షరాలనైతే, దగ్గరగా చూపిస్తూ చిన్న పిల్లలు రాయలేదు కదా? అంటూ జోక్స్ పేలుస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇవాంక నవ్వుల పాలవుతోందని అంటున్నారు విశ్లేషకులు.