అమెరికా అధ్యక్షుడంటే... అంతకంటే పెద్ద పదవి ఉండదన్నది అందరి వాదన. మరి అలాంటి పదవిలో ఉన్నవారిపై మీడియా దృష్టి ఎలా ఉంటుంది? అధ్యక్షుడితో పాటు అధ్యక్షుడి కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై ప్రత్యేక దృష్టి సారించేస్తుంది. ఏ చిన్న విషయం కనిపించినా కూడా దానిని మీడియా ఇట్టే పెద్దదిగా చేసేస్తుంది. అందుకని అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన నేత, ఆయన ఫ్యామిలీకి ఎక్కడ లేని భద్రత కొనసాగుతుంటుంది. మరి అధ్యక్ష పదవీ కాలం ముగిసిన తర్వాత ఆ మాజీ అధ్యక్షుడిపై మీడియా కన్ను అలాగే ఉంటుందనడానికి ఇప్పుడు జరిగిన ఓ ఘటన సాక్ష్యంగా నిలుస్తోందనే చెప్పాలి.
ఇక అసలు విషయానికి వస్తే... అమెరికా అధ్యక్షుడిగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కొనసాగుతున్నారు. ట్రంప్ కూతురు హోదాలో ఇవాంకా ట్రంప్ ఇప్పుడు హైదరాబాదు వస్తున్నారు. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సులో పాలుపంచుకునేందుకే ఇవాంకా వస్తున్నారు, అమెరికా అధ్యక్షుడి కూతురు హోదాలో వస్తున్న ఇవాంకాకు ఇప్పుడు ఎక్కడ లేని ప్రాధాన్యం దక్కుతోంది. ఇప్పుడు భారతీయ మీడియాతో పాటు వరల్డ్ మీడియా కూడా ఈ విషయంపై కథనాలపై కథనాలు రాస్తున్నాయి. ప్రత్యేకించి తెలుగు పత్రికలైతే... ఇవాంకా టూర్‌కు సంబంధించి ప్రతి చిన్న అంశాన్ని కూడా పతాక శీర్షికలేసి వార్తలు రాస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా ట్రంప్‌కు ముందు అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పనిచేసిన సంగతి తెలిసిందే. ట్రంప్‌కు ఒకే కూతురు అయితే... ఒబామాకు ఇద్దరు కూతుళ్లన్న విషయం తెలిసిందే. వారి పేర్లు మాలియా, శాషా అని కూడా మనకు తెలుసు. వీరిలో పెద్దమ్మాయి మాలియా ఒబామా ఇప్పుడు కాలేజీ ఏజ్‌లో ఉంది.
హార్వార్డ్-యేల్ టెయిల్ గేట్ వద్ద తన బాయ్ ఫ్రెండ్‌ను మాలియా ముద్దాడుతున్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా అక్కడే ఆ అబ్బాయ్‌తో చిట్ చాట్ చేస్తూ దమ్ము లాగించేస్తున్న మాలియా ఫొటో కూడా మీడియాకు చిక్కిపోయింది. ఈ ఫొటోలను ఆధారం చేసుకుని పలు పత్రికలు పలు కథనాలు రాస్తున్నాయి. అయితే అధ్యక్షుడి కూతురు అయినంత మాత్రాన... వారికి ప్రైవేట్ లైఫ్ అక్కర్లేదా? అంటూ ఇప్పుడు ఇవాంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మాలియాకు మద్దతుగా నిలిచింది. ఎంత రాజకీయ ప్రత్యర్థుల కూతుళ్లైనా... వీరిద్దరు కూడా అమ్మాయిలే కదా. అందుకేనేమో మాలియాకు ఇవాంకా మద్దతుగా నిలిచిందన్న వాదన వినిపిస్తోంది.