హైద‌రాబాద్‌ కు ట్రంప్ కూతురు..

Update: 2017-08-08 12:52 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్రమ మోడీ వినతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఓకే చెప్పారు. భార‌త్‌లో ప‌ర్య‌టించేందుకు ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇదో ఆస‌క్తిక‌ర‌మైన పరిణామం అయితే ఈ ప‌ర్య‌ట‌న తెలుగువారి రాజ‌ధాని హైదరాబాద్‌ కు తీపిక‌బురు. ఎందుకంటే ఇవాంక మొట్ట‌మొద‌టి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హైద‌రాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌ లో నవంబర్‌ లో జరుగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరయ్యేందుకు ట్రంప్ అనుమ‌తి మేర‌కు ఆమె కూతురు ఇవాంకాకు త‌న టూర్ విష‌యాన్ని వెల్ల‌డించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ నవంబర్‌ నెలలో హైదరాబాద్‌ కు రానున్నారు. అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ భారత్‌ లో జరిగే జీఈఎస్‌ లో పాల్గొనాలని మోడీ ఆహ్వానించ‌గా దీనికి ఇవాంకా ట్రంప్‌ ఆమోదం తెలిపారు. న‌వంబ‌రు చివ‌రి వారంలో ఇవాంక ప‌ర్య‌ట‌న ఉండ‌నుంది. త్వ‌ర‌లో ఇవాంక షెడ్యూల్ ఖ‌రారు వెలువ‌డ‌నుంది. కాగా, స్వదేశీ అభిమాని అయిన ట్రంప్ విభిన్న‌మైన రాజ‌కీయ‌వేత్త‌గా ఆయ‌న తీసుకుంటున్న ప్ర‌తీ నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారుతోంది.అలాంటి నిర్ణ‌యాల‌కు పెట్టింది పేర‌యిన ట్రంప్ త‌న ప‌రిపాల‌న‌లో కుమార్తె ఇవాంకాకు పెద్ద‌పీట వేసిన సంగ‌తి తెలిసిందే. షాడో అధ్య‌క్షురాలిగా ఇవాంకాను కొంద‌రు విమ‌ర్శ‌కులు ప్ర‌స్తావిస్తుంటారు.

కాగా ఇటీవ‌ల ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో స‌మావేశం అనంత‌రం తెలంగాణ‌ కేసీఆర్ మీడియాతో ముచ్చ‌టిస్తూ అమెరికా అధ్య‌క్షుడి కూతురు ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను స్వ‌యంగా వివ‌రించారు.  హైదరాబాద్‌ లో నవంబర్‌ లో జరుగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరయ్యేందుకు నరేంద్ర మోడీ అంగీకరించారని కేసీఆర్ వెల్లడించారు. ‘అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు తేదీలు ఇంకా ఖరారు కాలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పర్యటన తేదీలు ఖరారు కాగానే, సదస్సు తేదీలు ప్రకటిస్తాం’ అన్నారు.
Tags:    

Similar News