ఏపీలో మరో కలకలం రేగింది. ఇప్పటికే అటు విపక్ష వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు చంద్రబాబు పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ నుంచి సూటిగా దూసుకువస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బాబు సర్కారు తల ప్రాణం తోకకు వస్తోందన్న వాదన లేకపోలేదు. ఈ క్రమంలో బాబు సర్కారు నుంచి తీవ్ర అవమానానికి గురైన మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఇప్పటికే ఓ దఫా బాబు అండ్ కోను తీవ్ర ఇరకాటంలోకి నెట్టేశారు. తాజాగా మరోమారు తెర మీదకు వచ్చేసిన ఐవైఆర్... తాజాగా బాబు సర్కారు పాలన తీరుపై ప్రశ్నాస్త్రాలు సంధిస్తూ కాసేపటి క్రితం మరో లేఖాస్త్రాన్ని సంధించారు.
ఈ లేఖలో ప్రధానంగా చంద్రబాబు కార్యాలయం (సీఎంఓ)ను లక్ష్యంగా చేసుకుని ఐవైఆర్ చాలా కఠిన ప్రశ్నలనే సంధించారు. అదే సమయంలో బాబు పాలనలో జరుగుతున్న తంతును ఆయన జనం కళ్లకు కట్టినట్టుగా వ్యవహరించారన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రధానంగా సీఎం కార్యాలన్ని లక్ష్యంగా చేసుకుని ఐవైఆర్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో మరో పెను కలకలానికే తెర తీయనున్నాయన్న వాదన వినిపిస్తోంది. అయినా బాబుకు రాసిన లేఖలో ఐవైఆర్ ప్రస్తావించిన అంశాలను ఓ సారి పరిశీలిస్తే...
* సీఎం కార్యాలయం రాజ్యాంగేతర శక్తిగా మారింది.
* పారదర్శకత లేదు. సంస్కరణలు అమలు చేయడం లేదు.
* సమాంతర సెక్రటేరియట్ గా సీఎంఓ పనిచేస్తోంది.
* ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా సీఎంఓ పనిచేస్తోంది.
* నిర్దేశించిన నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయడం లేదు.
* సీఎంఓ రికార్డులన్నింటినీ పదిలపరిచేలా చర్యలు చేపట్టాలి. ఇప్పటిదాకా ఆ దిశగా అసలు సింగిల్ స్టెప్ కూడా పడలేదు.
* ఫైళ్లపై సీఎంఓ అధికారుల సంతకాలు లేకపోవడంతో మొత్తం వ్యవహారం ఇష్టారాజ్యమైపోయింది.
* సీఎంఓ కోసం ప్రత్యేక మాన్యువల్స్ రూపొందించాల్సిన అవసరం ఉంది.