టీడీపీకి ఒక చరిత్ర ఉంది. ఆ పార్టీ ఇవాళా నిన్నా పుట్టిన పార్టీ కాదు అలాంటి పార్టీ తెలంగాణాలో చచ్చిపోయింది అని అంటున్నారు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, బీజేపీ సీనియర్ నాయకుడు అయిన ఐవైఆర్ క్రిష్ణారావు. ఆయన రాజకీయ విశ్లేషణ చూస్తే కరెక్ట్ గానే ఉన్నా మరీ చచ్చిపోయిన పార్టీ అనడం ఒక విధంగా టీడీపీ మీద హార్ష్ గా కామెంట్ చేసినట్లే అంటున్నారు.
ఆయన చాలానే మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలలో బీజేపీతో టీడీపీ పొత్తు అన్నది జరిగే పని కాదని తేల్చేశారు. దాని మీద పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసేవారు ఇక రెస్ట్ తీసుకోవచ్చు అని ఆయన వ్యంగ్యంగా అనాల్సింది అనేశారు. నిజానికి ఈ పొత్తుల కోసం తెర వెనక వన్ సైడెడ్ గానే లాబీయింగ్ జరుగుతోందని కూడా ఆయన అంటున్నారు. పొత్తు అజెండా తో లాబీయింగ్ చేసేవారు ఆయాసపడవద్దు అని ఐవైఆర్ క్రిష్ణారావు చేసిన లేటెస్ట్ ట్వీట్ ఇపుడు వైరల్ అవుతోంది.
ఇక్కడ ఆయన బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ డియోధర్ పొత్తులు లేవు అంతా టీడీపీ మైండ్ గేమ్ అంటూ మాట్లాడిన దాన్ని కూడా జత చేసి మరీ ట్వీటేయడం చర్చకు తావిస్తోంది. దీనికి ముందు సునీల్ డియోధర్ కూడా ఇలాగే చెప్పారు. పొత్తుల విషయం ఏదీ చర్చలోనే లేదని, ఎవరో ఏదో రాశారని తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పుకొచ్చారు.
ప్రధాని మోడీ క్రిష్ణుడని ఆయన దుయోధనుడిని కూడా కలుస్తారని, అంతమాత్రం చేత ఆయన సాయం చేసినట్లు కలసినట్లు కాదని కూడా సునీల్ చెప్పుకొచ్చారు. దాన్నే పట్టుకుని క్రిష్ణారావు కూడా టీడీపీకి తెలంగాణాలో ఏముంది అంటూ గాలి తీసేశారు. అక్కడ అసలు లేని పార్టీని ముందు పెట్టుకుని వెళ్ళడం అంటే అది అదనపు బరువు తప్ప మరేమీ కాదని ఆయన అంటున్నారు.
ఇలాంటి గుదిబండ బరువుని బీజేపీ ఏ మాత్రం మోయదలచుకోలేదని ఆయన కుండబద్ధలు కొట్టారు. తెలంగాణాలో బీజేపీ సొంతంగానే తన యుద్ధాన్ని కొనసాగిస్తుందని కూడా క్రిష్ణారావు చెప్పారు. ఈ యుద్ధంలో తాము పోరాడడానికి అక్కడ ఏ మాత్రం మనుగడలో లేని పార్టీల సహకారం అసలు అవసరం లేదని కూడా స్పష్టం చేశారు.
మొత్తానికి ఐవైఆర్ క్రిష్ణారావు బీజేపీ నేతలు అందరి కంటే కూడా చాలా ఘాటుగానే టీడీపీ గురించి మాట్లాడారు అనుకోవాలి. ఆయన పూర్వాశ్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన చంద్రబాబు సీఎం గా ఉండగా సీఎస్ గా చేశారు. ఆ తరువాత ఆయన బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా కూడా చేశారు. అయితే బాబుతో ఆయనకు తేడా వచ్చి మధ్యలోనే తన పదవికి రాజీనామా చేశారు.
నాటి నుంచి ఆయన యాంటీ టీడీపీ యాంటీ చంద్రబాబు విధానాలే అనుసరిస్తున్నారు. ఇక అమరావతి రాజధాని విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అంటూ క్రిష్ణరావు అప్పట్లో తరచూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కూడా. మొత్తానికి ఐవైఆర్ బీజేపీలో చేరారు. ఆయన టీడీపీ నీడను కూడా తమ పార్టీ మీద పడకూడదు అనుకుంటున్నారు.
అయితే బీజేపీ జాతీయ నాయకత్వం టీడిపీతో పొత్తుల విషయాన ఏం చేసినా తానే నిర్ణయం తీసుకుంటుంది. అది మోడీ షాల వ్యూహాల మీద ఆధాపడి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణాలో టీడీపీ చచ్చిన పార్టీ అని క్రిష్ణారావు అనడం టీడీపీకి ఎక్కడో బాగా గుచ్చేసినట్లే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.