ఆంద్రప్రదేశ్ - తెలంగాణ ముఖ్యమంత్రులు తమ మద్య బద్ధ వైరుధ్యాన్ని పక్కనబెట్టి మరీ కష్టసుఖాలు పరామర్సించుకున్న ఉదంతాన్ని ఆదర్శంగా తీసుకున్నారేమో.. తెలుగు రాష్టాల ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతం స్నేహితులైపోయారు. మంగళవారం ఏపీ - తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు వైఆర్ కృష్ణారావు - రాజీవ్ శర్మలు తెలంగాణ సచివాలయంలో సమావేశమై రెండు రాష్ట్రాలకు సంబందించిన పలు సమస్యలపై చర్చించుకున్నారు. తెలుగు యూనివర్సిటీ - డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీల నిర్వహణలో ఉన్న చిక్కు ముళ్లను కూడా పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఒక అవగాహనకు వచ్చారు.
ఆంద్రా ఏరియాలో వెనువెంటనే స్టడీ సెంటర్లను తెరవడానికి తెలంగాణ ప్రధాన కార్యదర్సి అంగీకరించారు. ఆర్థిక శాఖ కార్యదర్శులు నిర్ణయించిన మేరకు అందుకయ్యే చార్జీలను కూడా చెల్లించడానికి ఏపీ ప్రధాన కార్యదర్సి అంగీకరించారు. ఏపీ జెన్ కో పెండింగ్ అరియర్ల చెల్లింపు సమస్య కూడా ఈ సమావేశంలో చర్చించారు. నెలకు 150 కోట్ల రూపాయలను చెల్లించడానికి తెలంగాణ ప్రధాన కార్యదర్సి హామీ ఇచ్చారు. రెండు పక్షాలూ వివాదాలకు దారితీస్తున్న ఇతర అంశాలపై కూడా చర్చించి పరిష్కరించుకోవడానికి ఒక అంగీకారనికి వచ్చినట్లు సమాచారం. సీనియర్ అధికారులు ఎస్ ప్రేమ్ చంద్రారెడ్డి - సుమిత దౌరా - కె సునీత - ఉదయలక్ష్మి - విజయానంద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రజలకు మహాశ్చర్యమూ - మహానందమూ కలిగించే అంశం ఒకటే.. ఈ ప్రేమలూ - ఈ సామరస్యతలూ - సమావేశాలు - పరస్పర అంగీకారాలూ ఇన్నాళ్లూ ఎక్కడిపోయాయి? పాలకులు తల్చుకుంటే తప్ప - పాలకుల మనసు మారకపోతే తప్ప ప్రభుత్వాధికారుల పనితీరు కూడా ఇలాగే ఉంటుంది మరి.