ప్ర‌త్యేక పోరు రూపం మార్చుకుంది

Update: 2016-01-10 07:48 GMT
రాష్ర్ట విభ‌జ‌న ప్ర‌భావాన్ని పెద్ద ఎత్తున ఎదుర్కుంటున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి ఉప‌శ‌మ‌నంగా నిలిచే ప్ర‌త్యేక హోదా విష‌యంలో అస్ప‌ష్ట‌త‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో అసంతృప్తుల తీవ్ర రూపం దాల్చుతున్నాయి. త‌న‌కున్న ప‌రిమితుల రీత్యా అధికార తెలుగుదేశం పార్టీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీతో సున్నితంగా డిమాండ్ చేస్తుండ‌గా.. ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌జాస్వామ్యరూపంలో విన‌తిప‌త్రాలు అంద‌జేస్తూ, లేఖ‌లు రాస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ప్ర‌త్యేక హోదా కోసం పోరాటాలు - ప్రజా చైత‌న్య‌మే కీల‌కం అన్న భావ‌న తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇందుకోసం త‌ట‌స్థంగా ఉండే ప‌లు వర్గాలు త‌మ నిర‌స‌న‌కు ఐక్యం రూపం ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర నాన్‌ పొలిటికల్ జేఏసీ - నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ - ఏపీ నిరుద్యోగ పోరాట రాష్ట్ర సమితి ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌ల సిద్ధం చేసుకున్నాయి. ఈ వేదిక‌ల ఆధ్వర్యంలో ఈనెల‌ 27వ తేదీ నుండి బస్సు యాత్ర చేయ‌నున్నారు.

27న శ్రీకాకుళంలో ప్రారంభం కానున్న బస్సు యాత్ర అదే రోజు విజయనగరం చేరుకుంటుంది. 28న విశాఖపట్నం - గాజువాక - రాజమండ్రిల్లో - 29న ఏలూరు - విజయవాడల్లో - 30 - 31 తేదీల్లో మంగళగిరి - గుంటూరుల్లో - ఫిబ్రవరి 1న ప్రకాశం - నెల్లూరు - 2న నెల్లూరు - తిరుపతిలో బస్సు యాత్ర ఉంటుంది. యాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించ‌నున్నారు.
Tags:    

Similar News