రాజకీయంగా లెక్కలు తేడా ఉంటే మాత్రం.. ఇష్టారాజ్యంగా మాట్లాడేయటం మంచిది కాదన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆశా వర్కర్లు తమ జీతాలు పెంచాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వరంగల్ జిల్లాలోని కోమల్ల గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమానికి విచ్చేసిన ఆయన.. ఆశా కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తమైంది.
దీంతో మండిపడిన తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి నోటి వెంట నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆశా వర్కర్ల నిరసన వెనుక కొన్ని ఆంద్రా కుక్కలు ఉన్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఆశా వర్కర్లవి ప్రభుత్వ ఉద్యోగాలు కానప్పుడు.. ప్రభుత్వం వారి సమస్యల్ని ఎలా పట్టించుకుంటుందంటూ దులిపేశారు.
తనకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఆశా వర్కర్ల పై ఫైర్ అయిన ఆయన.. ఆంధ్రా కుక్కలంటూ వ్యాఖ్యలు చేశారు. తమను ఇబ్బంది పెట్టేలా ఎవరైనా నిరసనలు నిర్వహిస్తే.. దానికి ఆంధ్రా హస్తం ఉన్నట్లుగా వ్యాఖ్యానించటం.. విమర్శించటం ఈ మధ్య కాలంలో తెలంగాణ అధికారపక్ష నేతలకు ఒక అలవాటుగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎవరేం చేసినా.. అదంతా ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతల కుట్రగా అభివర్ణించటం ఏమిటని.. ఇలాంటి వ్యాఖ్యలు సరి కావంటూ ఏపీ నేతలు మండిపడుతున్నారు. ఆరోపణలు.. విమర్శలు చేసే సమయంలో సరైన ఆధారాలు ఉంటే బాగుంటుంది కానీ అదేమీ లేకుండా నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం సరైంది కాదని చెబుతున్నారు. మరి.. ఇలాంటి మాటలు దూకుడు నేత జగదీశ్వర్ రెడ్డి లాంటి వారికి అర్థమవుతాయా? అన్నదే పెద్ద ప్రశ్న.