వ‌ర్క్ షాప్ మొద‌ల‌యింది స‌ర్.. ఏం చేద్దాం ఇప్పుడు!

Update: 2022-06-08 14:30 GMT
గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ కార్య‌క్ర‌మం  ఇక‌పై కూడా ఉండ‌నుంది. ఈ స‌మ‌యాన ఏం చేయాలి అన్న‌ది అధికార పార్టీ నాయ‌కులు కూడా క‌ల‌వ‌రం చెందుతున్నారు. క్షేత్ర స్థాయిలో నిర‌స‌న‌లు త‌ట్టుకోవ‌డం క‌ష్టంగా ఉంద‌ని చెప్పినా కూడా సీఎం మాత్రం వినిపించుకోవ‌డం లేదు. నిర‌స‌న‌లు ఉన్నా స‌రే ప్ర‌జాభిప్రాయం వినాల్సిందే అంటూ ఇవాళ  మ‌రోసారి దిశా నిర్దేశం చేశారాయ‌న. ఆ వివరం ఈ క‌థ‌నంలో..
 
ఇంత‌కాలం ఇళ్ల‌కే పరిమితం అయి ఉన్న  నేత‌లు ఇప్పుడిక ఇల్లు దాటి రావాలి. రాకపోతే సీఎం ఒప్పుకోరు. గ‌డ‌ప‌గ‌డ‌పకూ మ‌న ప్ర‌భుత్వం పేరిట మంచి  ఎండ‌ల్లో తిర‌గ‌మంటున్నారే ఇది మీకు న్యాయ‌మా అని చాలా మంది ఆవేదనతో ఆర్తనాదాలు చేశారు. కానీ జ‌గ‌న్ అవేవీ వినిపించుకోకుండానే జ‌నంలోకి త‌న ఎమ్మెల్యేల‌నూ, ఇత‌ర ఇంఛార్జుల‌నూ పంపారు.

పార్టీ ప‌ని త‌నం తెలియా లన్నా, ప్ర‌భుత్వం ప‌ని త‌నం తెలియాలి అన్నా చేయాల్సిన‌వి ఎన్నో ఉన్నాయ‌ని వాటికోసం క్షేత్ర స్థాయిలో తిర‌గాల్సిందేన ని స్ప‌ష్టం చేశారు. దాదాపు నెల రోజులు గ‌డప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం నిర్వ‌హించాక రిజ‌ల్ట్ ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు సీఎం ఇవాళ వ‌ర్క్ షాప్ నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తున్నాం క‌నుకనే కాల‌ర్ ఎగ‌రేసుకుని తిర‌గ‌గ‌లుగుతున్నామ‌ని సీఎం అంటున్నారు.

ఇక పై నెల‌లో 20 రోజుల పాటు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. ఇదే స్ఫూర్తితో స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు. ఎమ్మె ల్యేల‌కు నిర‌స‌న‌లు ఎదుర‌యినా స‌రే ! ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగించ‌నున్నారు. నెల రోజుల త‌రువాత రివ్యూ ఉంటుంది. వ‌ర్క్ షాప్ ఉంటుంది. ఐ ప్యాక్ టీం వీటిని నిర్వ‌హించనున్నారు. ప్ర‌తి స‌చివాల‌యం పరిధిలో ఈ కార్య‌క్ర‌మం త‌ప్ప‌క చేయ‌నున్నారు.

ఇక ఎమ్మెల్యేలూ, ఎంపీలూ నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉండాలి. అదేవిధంగా స‌మ‌స్య‌లు ఎక్క‌డిక‌క్క‌డ ప‌రిష్క‌రించాలి. నిధుల స‌మ‌స్య ఎదురైతే వెంట‌నే తెలియ‌జేయాలి. అయితే చాలా చోట్ల నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి క‌నుక కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసుకుని వెళ్తున్నార‌ని సీఎం దృష్టికి వెళ్లింది. అలాంటివి అస్స‌లు వ‌ద్దేవ‌ద్ద‌ని వీలున్నంత వ‌ర‌కూ ప్ర‌జాభిప్రాయం తెలుసుకుందామ‌ని చెప్పార‌ని అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. నెల‌లో ప‌ది గ్రామ, వార్డు స‌చివాల‌యాల‌ను ముఖ్య‌మ‌నుకునే ప్ర‌జాప్ర‌తినిధులు వారి వారి ప‌రిధిలో ఈ కార్య‌క్రమాన్ని నిర్వ‌హించాల్సిందే !అని కూడా తేలిపోయింది.

ప్ర‌తి స‌చివాల‌యం ప‌రిధిలో రెండు రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాలి. దీంతో ప్ర‌భుత్వం త‌ప్పిదాలు తెలిసివ‌స్తాయ‌ని వైసీపీ అధినాయ‌క‌త్వం భావిస్తోంది. ఇక ఇదే స‌మ‌యంలో టీడీపీ కూడా కౌంట‌ర్ ఎటాక్ ఇచ్చేందుకు కూడా సిద్ధం అవుతోంది. బాదుడే బాదుడు కార్య‌క్ర‌మాన్ని మ‌ళ్లీ ప్రారంభించాల‌ని యోచిస్తోంది. ప్ర‌తి నెల రెండు జిల్లాల‌ను ప‌ర్య‌టించాల‌ని బాబు అనుకుంటున్నారు. ఇవి కాకుండా క్షేత్ర స్థాయి స‌మ‌స్య‌లు తెలుసుకుని వాటిపై పోరుబాట ప‌ట్టే విధంగా నిర‌స‌న‌ల‌కు సైతం సిద్ధం అవుతున్నారు. అంటే ప్ర‌జాక్షేత్రంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ ఇప్పుడిక నిరంత‌రం జ‌నంలోనే ఉండ‌నున్నారు అన్న‌ది తేలిపోయింది. రానున్న రెండేళ్లూ అధినాయ‌క‌త్వంతో పాటు సామాన్య కార్య‌క‌ర్త వ‌ర‌కూ క‌ష్ట‌ప‌డితేనే ఫ‌లితం అన్న‌ది కూడా నిర్థార‌ణ అయిపోయింది.
Tags:    

Similar News