ఆరోగ్య శ్రీ హామీ అమలు వెయ్యి దాటితే ఫ్రీ

Update: 2020-07-13 17:36 GMT
మరో ఎన్నికల హామీని నిలబెట్టుకోవడంతో పాటు కరోనా సమయంలో అందరికీ అనువుగా ఉండేలా ఆరోగ్యశ్రీలో జగన్ మార్పులు చేశారు. కరోనాను ఆరోగ్య శ్రీ కిందకు తెచ్చి ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఏపీ సర్కారు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రి ఖర్చులు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపు చేస్తామని జగన్ ఎన్నిక‌ల్లో‌ ఇచ్చిన హామీని తాజాగా అమల్లోకి తెచ్చారు.

ఇప్పటికే గత జనవరిలో పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అక్కడ విజయవంతం అయ్యింది. జగన్ రాక ముందు 1,059 రోగాలకు ఆరోగ్య శ్రీలో చికిత్సలు చేసేవారు. తాజాగా ఆ సంఖ్యను 2200 కి పెంచారు. అయితే నేరుగా ఈ సంఖ్యకు రాలేదు. ముందు 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేశారు. త‌ర్వాత మరిన్ని వ్యాధులను దాని పరిధిలోకి తెచ్చార. ఆ తర్వాత అది 2146కు పెంచారు. మళ్లీ ఆరోగ్యశ్రీ కిందకు అన్ని క్యాన్సర్ చికిత్సలను చేర్చడంతో ఆరోగ్య శ్రీ వ్యాధుల కవరేజీ 2200 కి పెరిగింది.

గురువారం నుంచి ఈ ప్రక్రియ తొలుత ఆరు జిల్లాల్లో అమల్లోకి రానుంది. తదనంతరం అన్ని జిల్లాలకు విస్తరిస్తారు. ప్రస్తుతం కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొత్త మార్పులు అందుబాటులోకి వచ్చాయి.
Tags:    

Similar News