సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు

Update: 2019-09-21 09:16 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలనను పరుగులు పెట్టించడానికి పూనుకున్నారు. ఈ మేరకు తన సీఎం కార్యాలయంలోకి కొత్తగా అధికారులను తీసుకొని వారికి తిరిగి శాఖలను పునర్విభజించారు.  తాజాగా శాఖలను ఐఏఎస్ అధికారులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కేటాయించిన శాఖల వారీగా ఐఏఎస్ అధికారులు ఆయా శాఖల నుంచి వచ్చే ఫైళ్లను స్వీకరించి సీఎం ఆమోదం తీసుకుంటారు. 

ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో సీఎం ప్రధాన సలహాదారుగా అజయ్ కల్లెం ఉన్నారు. ఆయనతోపాటు సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రెటరీగా పీవీ రమేష్ - ప్రిన్సిపల్ సెక్రెటరీగా ప్రవీణ్ ప్రకాష్ - సీఎంవో కార్యదర్శిగా సాల్మన్ అరోక్లా రాజ్ - సీఎంవో అదనపు కార్యదర్శిగా ధనుంజయ రెడ్డి - ప్రత్యేక కార్యదర్శులుగా జే మురళి - కృష్ణ దువ్వూరి - సీఎంవో స్పెషాలాఫీసర్ గా ముక్తాపురం హరికృష్ణ - సీఎం ఓఎస్డీగా పి.కృష్ణ మోహన్ రెడ్డిలు పనిచేస్తున్నారు. . వీరందరికీ శాఖలు కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

*ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులకు కేటాయించిన శాఖలు ఇవే..

*అజేయ కల్లం - సీఎం ముఖ్య సలహాదారు

 హోంశాఖ - ఆర్థిక - ప్రణాళిక - రెవెన్యూ - శాంతిభద్రతల అంశాలు - ముఖ్యమంత్రి కార్యాలయ కార్యకలాపాలు.

*పీవీ రమేష్ - సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ

వైద్య ఆరోగ్యం - కుటుంబ సంక్షేమ శాఖ - విద్యాశాఖ(పాఠశాల - ఇంటర్ - ఉన్నత - సాంకేతిక విద్య) - పరిశ్రమలు - వాణిజ్యం - మౌళిక వసతులు - పెట్టుబడులు - ప్రభుత్వ రంగ సంస్థలు - ఐటీ - ఇన్‌ ఫ్రా.

* ప్రవీణ్ ప్రకాష్ - సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ

సాధారణ పరిపాలన - ఇంధన శాఖ - సీఎంవో రాష్ట్ర  -జాతీయ వ్యవహారాలు - ప్రధానులు - ముఖ్యమంత్రులతోపాటు రాష్ట్రాలతో సంబంధాల పర్యవేక్షణ - ప్రాజెక్టులు - ఆర్థిక వ్యవహారాలు - కేంద్రంతో చర్చలు - సీఎం జగన్ ఢిల్లీ వ్యవహారాలు - సీఎంవో ఫైళ్ల పర్యవేక్షణ బాధ్యతలు.. నివేదికలు - మేనేజ్ మెంట్ ఇన్ ఫర్మేషన్ సిస్టం పర్యవేక్షణ

*సొల్మన్‌ ఆరోక్య రాజ్ - సీఎం కార్యదర్శి

ట్రాన్స్‌ పోర్ట్‌ రహదారులు - భవనాల శాఖ - ఏపీఎస్‌ ఆర్టీసీ - గృహ నిర్మాణం - ఆహార - పౌరసరఫరాల - వినియోగదారుల సమస్యలు - పంచాయతీరాజ్ - గ్రామీణ అభివృద్ధి - సెర్ప్ - అన్ని సంక్షేమ శాఖలు - యువజన వ్యవహారాలు - క్రీడలు. మైనింగ్ - భూసంబంధ వ్యవహారాలు కార్మిక - ఉపాధి కల్పన - శిక్షణ

*కె.ధనుంజయరెడ్డి - సీఎం అదనపు కార్యదర్శి

నీటి వనరులు - పర్యావరణం - అటవీ - సాంకేతిక - మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్ - అర్బన్‌ డెవలప్‌ మెంట్ - సీఆర్‌ డీఏ - వ్యవసాయం - హార్టికల్చర్ - సెరికల్చర్ - పర్యాటకం.

*జె.మురళి - సీఎం అదనపు కార్యదర్శి

పశుసంవర్థక - పాడి పరిశ్రమ - మత్స్యశాఖ - సహకారం - సంస్కృతి. ఎమ్మెల్యే - ఎంపీ ల గ్రీవెన్స్ సెల్ - స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్

*కృష్ణ దువ్వూరి - సీఎంవో స్పెషల్ సెక్రెటరీ

ఆర్థిక వ్యవహారాలు - ఇంధన శాఖ 

*డాక్టర్‌ ముక్తాపురం హరికృష్ణ - సీఎం ప్రత్యేక అధికారి

ఆరోగ్య శ్రీ - ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ ఎఫ్) - విజ్ఞాపనలు(ఎంపీలు - ఎమ్మెల్యేలు - ప్రజల విజ్ఞప్తులు).

*పి.కృష్ణమోహన్‌ రెడ్డి - ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌ డీ)

ముఖ్యమంత్రికి సంబంధించిన మినిట్‌ టు మినిట్‌ ప్రోగ్రామ్ - అపాయింట్‌ మెంట్స్ - విజిటర్స్‌ అపాయింట్‌ మెంట్స్‌.
Tags:    

Similar News