జగన్ దెబ్బకు జ్యోతులకు షాక్

Update: 2016-03-21 09:05 GMT
 వైఎస్ జగన్ ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పలేమని ఆ పార్టీ నేతలే అంటుంటారు. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో సీనియర్లు జ్యోతుల నెహ్రూ - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - అమరనాథరెడ్డిలు షాక్ తిన్నారు. ఏపీ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) ఛైర్మన్ పదవికి కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ను ఎంపిక చేశారు. వైసీఎల్పీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే... జగన్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తొలి యత్నంలో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయిన బుగ్గనకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యం ఇచ్చి తమకు అన్యాయం చేశారంటూ సీనియర్లు అసంతృప్తికి లోనయినట్లు తెలుస్తోంది.

పీఏసీ ఛైర్మన్  పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ. ఈక్రమంలో సభలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని నియమించింది. అయితే.. నాగిరెడ్డి ఇప్పుడు టీడీపీలో చేరి ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఆ పోస్టు కోసం పార్టీ సీనియర్లు జ్యోతుల నెహ్రూ - పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి - ఎన్.అమరనాథరెడ్డి తదితరులు ప్రయత్నాుల చేశారు. కానీ, వారెవరికీ ఛాన్సివ్వకుండా జగన్ బుగ్గనను ఈ పదవిలో నియమించారు.
Tags:    

Similar News