ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తుదితీర్పును సీబీఐ కోర్టు వాయిదా వేసింది.. ఈ మేరకు కోర్టు తీర్పునిచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై తుది తీర్పును సెప్టెంబర్ 15న ప్రకటిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటీషన్ పై కూడా నేడు వాదనలు ముగిశాయి. విజయసాయిరెడ్డి, జగన్ బెయిల్ రద్దు పిటీషన్లపై ఒకేసారి తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం వెలువరించింది. సెప్టెంబర్ 15న ఇరు పిటీషన్లపై తీర్పులు ఇస్తామని తెలిపింది.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గతంలోనే సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయాలని.. ఆయన అధికారంతో సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని ఈ పిటీషన్ దాఖలు చేశారు.ఇప్పటికే వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ నిర్ణయించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకుంది.
రఘురామ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటీషన్ పై గతంలోనే సీబీఐ ప్రత్యేక కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. సీబీఐ అధిప్రాయాన్ని కూడా తెలుసుకుంది. కోర్టు విచక్షణ మేరకే బెయిల్ రద్దు పిటీషన్ పై నిర్ణయం తీసుకోవాలని సీబీఐ అధికారులు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఇవాళ బెయిల్ రద్దుపై కోర్టు తుది తీర్పును వాయిదా వేసింది..
మాజీ మంత్రి శంకర్ రావు, మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు ఉమ్మడి ఏపీ హైకోర్టులో జగన్ అక్రమాస్తులపై పిటీషన్లు దాఖలు చేశారు. 2011 ఆగస్టు 10న సీబీఐ విచారణకు ఉమ్మడి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ జగన్ సహా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ కేసులో ప్రధాన వ్యక్తులుగా ఉన్నారు. మొత్తం 71మంది నిందితులుగా ఉన్నారు. సీబీఐ ఈ కేసులో 11 చార్జీషీట్లను దాఖలు చేసింది. ఈడీ కూడా చార్జీషీట్లు వేసింది. తాజాగా బెయిల్ పై తుది తీర్పును సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది.