బుల్డోజ‌ర్ పాల‌న తెస్తున్న జ‌గ‌న్‌.. నారా లోకేష్ ఫైర్‌

Update: 2022-04-25 13:30 GMT
ముళ్ల కంచె లోపల దాక్కుని ఎన్నాళ్లు పాల‌న సాగిస్తార‌ని.. సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యద ర్శి నారా లోకేష్ మండిప‌డ్డారు. రాష్ట్రంలో బుల్డోజ‌ర్ పాల‌న‌కు జ‌గ‌న్ శ్రీకారం చుడుతున్నార‌ని అన్నారు. సీపీఎస్ రద్దు కోసం ఉపాధ్యాయులు శాంతియుతంగా నిరసన తెలపడం నేరమా? అని నిలదీశారు. ప్రభుత్వ నిర్బంధకాండను ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్లని.. లోకేష్‌ ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలపడమే నేరమంటూ... యూటీఎఫ్ నేతలు, ఉద్యోగ సంఘం నాయకులు, ఉపాధ్యాయులను అక్రమంగా నిర్బంధించడాన్ని లోకేశ్ ఖండించారు.

వారం రోజుల్లో సీపీఎస్ రద్దని... మాట తప్పి మడమ తిప్పిన జగన్... మోసపు రెడ్డి కాదా అని దుయ్యబట్టారు. ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్బంధ కాండను తప్పుబట్టారు. కాకమ్మ కబుర్లతో మూడేళ్లు గడిపేశారన్న లోకేశ్... ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం జగన్ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాస్తూ.. బుల్డోజర్ వ్యవస్థను రాష్ట్రంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని.. మండిపడ్డారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న దాహంతో.. జగన్ ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి మర్చిపోయినా.. నమ్మిన ఉద్యోగులు మర్చిపోలేదన్నారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటామని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న దాహంతో.. జగన్ ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చారని మండిపడ్డారు. ప్రచారంలో చిటికెలేసి మరీ.. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్నారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి మర్చిపోయినా.. నమ్మిన ఉద్యోగులు మర్చిపోలేదని.. అచ్చెన్న అన్నారు.

ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాస్తూ..సీఎం జగన్ బుల్డోజర్ వ్యవస్థను రాష్ట్రంపై రుద్దేందుకు యత్నిస్తున్నారని.. మ‌రో సీనియ‌ర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ ఇచ్చిన హామీని.. ఉపాధ్యాయులు నెరవేర్చాలంటున్నారే తప్ప.. లోటస్ పాండ్లో వాటా అడగటం లేదు కదా అని నిలదీశారు. ఏపీలో జగన్ పాలనలో ఉన్న ఆంక్షలు.. కశ్మీర్ సరిహద్దుల్లోనూ లేవని విమర్శించారు.
Tags:    

Similar News