వ్యాక్సినేషన్ కోసం జగన్ సర్కార్ నూతన విధానం

Update: 2021-05-10 11:30 GMT
ఏపీలో ఇప్పుడు వ్యాక్సిన్ల కోసం జనం ఎగబడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద గుంపులుగా తోసుకుంటూ.. కొట్టుకుంటూ నానా రచ్చ చేస్తున్నారు. దీనివల్ల భయంకర కరోనా మరింతగా విస్తరించే ప్రమాదం ఉంది. దీంతో జగన్ సర్కార్ అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను రెండు రోజుల పాటు నిలిపివేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో వ్యాక్సినేషన్ కోసం ఇక కొత్త విధానం అమలు చేయనున్నారు. కరోనా యోధులు, 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లు దాటిన వారిని విభజించి రెండో డోస్ వ్యాక్సిన్ వేసేందుకు పకడ్బందీ ప్రణాళిక చేస్తున్నారు. ఈ విధానంలో మూడు రకాల టోకెన్లను ఆశా కార్యకర్తలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందజేస్తారు. ఎవరెవిరికి ఎప్పుడెప్పుడు టీకా వేస్తారనే పూర్తి సమాచారం ఈ టోకెన్ లో ఉంటుంది. దాని ప్రకారం నిర్ధేశించిన సమయానికి వెళితే ఈ టీకా వేస్తారు. దీంతో రద్దీని తగ్గించవచ్చని ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది.

అయితే వ్యాక్సినేషన్ నిలిపివేసినట్టు ప్రజలకు సమాచారం ఇవ్వకపోవడంతో  చాలా జిల్లాల్లోని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో జనాలు ఇప్పటికీ బారులు తీరారు. ముందస్తుగా ప్రజలను ఈ విషయంలో అప్రమత్తం చేయకపోవడంతో ఈ సమస్య నెలకొంది.
ప్రస్తుతానికి ఏపీలో 3.5 లక్షల డోసులు అందుబాటులో ఉంది. దీంతో రెండో డోసు వారికే వీటిని వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Tags:    

Similar News