కేంద్రంలో బీజేపీ ఒకే దేశం ఒకే విధానం అంటోంది. ఇపుడు జగన్ కూడా అదే టైప్ లో వెళ్తున్నారు. ఒకే రాష్ట్రం, ఒక్కటే రాజకీయం తన విధానం అని చెప్పుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ దానికి ఆయన ఇచ్చిన ఉదాహరణలు మాత్రం విపక్షాలను బాగా కెలికి వదిలిపెట్టినట్టు ఉన్నాయి. చంద్రబాబు వరకూ చూస్తే రాజకీయ విమర్శలుగా ఉన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం పూర్తిగా వ్యక్తిగత విషయాలను తెచ్చి కోరి కెలికారు అనిపించుకున్నారు జగన్.
ఇంతకీ ఆయన సొంత గడ్డ కడపలో చేసిన హాట్ హాట్ కామెంట్స్ ఏంటి అన్నది చూస్తే రచ్చ రచ్చ అయ్యేలాగే ఉన్నాయి. తనది ఒకే ఒక పార్టీ అని తనకు ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రా అని జగన్ చెప్పుకున్నారు. తనకు అయిదు కోట్ల మంది ఆంధ్రులే కుటుంబ సభ్యులని అన్నారు. వారి మేలు కోసమే తాను రాజకీయాలు చేస్తాను అని ఆయన అంటున్నారు.
అయితే చంద్రబాబు మాదిరిగా తాను ఒక రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం అని అనను అన్నారు. అలాగే ఒక పార్టీ కాకపోతే మరో పార్టీ అని కూడా తాను అనను అని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ణి దత్తపుత్రుడు అంటూ మరోమారు ట్యాగ్ తగిలించారు. ఆయన మాదిరిగా ఒక పెళ్లాం కాకపోతే మరో పెళ్ళాం అని తాను అనలేనని చెప్పుకున్నారు.
తాను ఏపీలోనే నివాసం ఉంటున్నట్లుగా జగన్ గుర్తు చేయడం విశేషం. తనకు ఏపీ ప్రజల సంక్షేమం ముఖ్యమని వారి కోసమే తాను పనిచేస్తాను అని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ కొంత వేదాంత ధోరణిలో కామెంట్స్ చేశారు. ఎన్నికలు వస్తూంటాయి పోతూంటాయి కానీ ప్రజల గుండెలలో మంచి చేసిన వారు చిరస్థాయిగా నిలుస్తారు అని ఆయన పేర్కొన్నారు. ఇక ఎన్నికలలో అంతా కలసి వచ్చినా తాను ప్రజలను దేవుడిని నమ్ముకున్నాను అని జగన్ మరోసారి చెప్పారు.
తనకు ఈ రెండూ తప్ప మరో అండలేదని, ఎల్లో మీడియా దత్తపుత్రుడితో కలసి చంద్రబాబు వస్తున్నారు అని విమర్శించారు. ఎందరు కలసి వచ్చినా ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు మంచి చేసిన వారి పక్షమే ఉండాలని ఆయన కోరుకున్నారు. ఎన్నికల మ్యానిఫేస్టోలో చెప్పిన మాటలను అమలు చేయకుండా చెత్త బుట్టలో వేసే వారు అంటూ విపక్షాల మీద విమర్శలు సంధించారు. తాను మాత్రం తుచ తప్పకుండా అన్నీ అమలు చేస్తున్నాని మంచి చేసిన వారిని దేవుడు తప్పకుండా దీవిస్తారు అని ప్రజలు కూడా దీవిస్తారని విశ్వాసాన్ని జగన్ వ్యక్తం చేశారు. మొత్తానికి సొంత జిల్లాలో జగన్ పవన్ని చంద్రబాబుని కలిపి మరీ పంచులేసి హీట్ పుట్టించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.