బాబు లేఖపై జగన్ ఆటాడుకుంటున్నారా?
మాటలు చాలా చిత్రమైనవి. వినేవాడ్ని నమ్మించేలా చెప్పే మాటలు ఉంటే.. నిజం ఏమిటన్న ఆలోచన కూడా రాదు. సమర్థవంతంగా వాదన వినిపించేలా మాటలు ఉంటే.. లేనిపోని సందేహాలు కలగటం ఖాయం. తాజాగా ఏపీ విపక్ష నేత జగన్ మాటలు ఇదే తీరులో ఉన్నాయి. పెద్దనోట్లను రద్దు చేయాలంటూ ఆ మధ్యన బాబు మాట్లాడటం.. కేంద్రానికి లేఖ రాయటం.. అలా జరిగిన కొద్ది రోజులకే ప్రధాని మోడీ పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం లాంటి అంశాలపై జగన్ లేవనెత్తుతున్న వాదన కన్వీన్స్ చేసేలా ఉండటమే కాదు.. కొత్త సందేహాలు కలిగేలా ఉండటం గమనార్హం.
పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రికి ముందే తెలుసన్న వాదనను వినిపిస్తున్న జగన్.. తాజాగా తన వాదనను మరింత సమర్థంగా వినిపిస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాల్ని తీర్చేందుకు గవర్నర్ కలుగజేసుకోవాలన్న విన్నపాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా జగన్ చేసిన వాదన ఆసక్తికరంగా ఉండటమే కాదు.. బాబు మీద కొత్త సందేహాలు వచ్చేలా చేస్తున్నాయటంలో సందేహం లేదు.
రాజ్ భవన్ బయట మీడియాతో మాట్లాడిన జగన్ మాటల్ని.. ఆయన మాటల్లోనే చూస్తే.. ‘నాకు తెలిసినంత వరకూ ఈ ప్రక్రియ అంతా నల్లధనాన్ని వెలికితీయడంకోసం చేసినట్లుగా అనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన లాంటివ్యక్తులు ముందుగానే పూర్తిగా చక్కబెట్టుకున్నారు. నోట్ల రద్దు గురించి వారికిముందే తెలుసు. పెద్ద నోట్ల రద్దుకు రెండు రోజుల ముందు చంద్రబాబు తన హెరిటేజ్ కంపెనీ షేర్లను ఫ్యూచర్ గ్రూపునకు ఆమ్మేయడం మన కళ్ల ముందేజరిగింది. హెరిటేజ్ సంస్థ నష్టాల్లో ఉన్నా అమ్మేసుకున్నారు. నోట్ల రద్దు నిర్ణయంనవంబర్ 8న వెలువడింది. అక్టోబర్ 12వ తేదీన, అంటే 26 రోజుల ముందు పెద్దనోట్లను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖరాశారు. అది తన ఘనతేనని చాటుకునే ప్రయత్నం చేశారు. నిజంగా ఇలాంటిఅంశాలపై లేఖ రాయాలని మీకు గానీ.. నాకు గానీ తట్టదు. ఈ భూ ప్రపంచంలో భూమి అంతా లేకుండా పోతుంది కాబట్టి చంద్రమండలంలో ఇళ్లు కడితే బాగుంటుందని మోదీకి నువ్వూ (మీడియాను ఉద్దేశించి).. నేనూ లేఖ రాస్తే ఎలాఉంటుంది? ఎవరో పిచ్చివాడు ఈ లేఖ రాశాడని అనుకుంటారు. కానీ.. ఇలాంటిలేఖ రాయాలన్న ఆలోచన చంద్రబాబుకు రావడమే ఆశ్చర్యకరం. ముందస్తు సమాచారం ఉన్న చంద్రబాబులాంటి వారంతా తమ వద్ద ఉన్న రూ.వేల కోట్లుచక్కబెట్టుకున్నారు’’ అంటూ జగన్ వినిపించిన వాదన వింటుంటే.. ఏమనిపిస్తోంది..? ఇప్పుడు అర్థమైందా మాటలకుండే పవర్ ఎంతన్నది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/