ఏపీ అసెంబ్లీలో తాజాగా వాడీవేడిగా వ్యాఖ్యలు చోటు చేసుకుంటున్నాయి. అధికారపక్షానికి..ప్రధాన ప్రతిపక్షానికి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదంటూ ఏపీ విపక్ష నేత జగన్ వ్యాఖ్యలకు తగ్గట్లే..ఆయన మాట్లాడుతున్న సందర్భాల్లో పలుమార్లు ఆయన మైక్ కట్ అయ్యింది.
దీంతో.. ప్రధానప్రతిపక్షం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా జగన్‌మాట్లాడుతుండగా ఆయన మైకు కట్ కావటం.. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడుకు మాట్లాడే సమయం ఇచ్చారు. ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి.. వాటికి కౌంటర్ ఇచ్చేందుకు అధికారపక్ష నేతలు మాట్లాడుతున్న విషయం తెలిసిందే.
తాజాగా అచ్చెన్నాయుడు అదే పద్ధతిలో మాటల దాడి స్టార్ట్ చేశారు. దీనికి కౌంటర్ గా జగన్ మాట్లాడుతూ.. ఆర్థిక విషయాలు తెలియని వారు సైతం సభలో మాట్లాడుతున్నారని.. ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలని హితవు పలికారు. ఎదుటివారిపై రాళ్లు వేయటం సరికాదని.. కాస్త బుర్ర ఉపయోగించాలంటూ చురక అందించటం.. సభలో కాసేపు గందరగోళం చోటు చేసుకుంది.