క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రాజకీయ నాయకులు యాత్రలు చేయడం పరిపాటి. కొందరు బస్సు యాత్రలు, రోడ్ షోలు...ఇలా పెద్దగా కష్టపడకుండా తామూ యాత్ర చేశామని మమ అనిపించేస్తారు. పోనీ ఆ బస్సుయాత్రనో.....వారు పెట్టుకున్న సోకాల్డ్ యాత్రనో పూర్తి చేసే క్రమంలో లెక్కలేనన్ని బ్రేకులు తీసుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. అటువంటిది ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు నేతలు మాట తప్పకుండా మడమ తిప్పకుండా పాదయాత్ర చేయడం నిజంగా చారిత్రాత్మకం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన పాదయాత్ర ప్రస్థానాన్ని..... ఆయన తనయురాలు షర్మిల పూర్తి చేయగా....ఆయన తనయుడు జగన్ నిర్విరామంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రతిపక్ష నేత - వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేడు తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించడంతో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్ - షర్మిల ల మాదిరిగానే జగన్ కూడా రాజమండ్రిలోని చారిత్రక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా నేడు తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. ఈ అరుదైన ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 2013 - జూన్ 4న వైఎస్ చేపట్టిన 'ప్రజా ప్రస్థానం' యాత్ర ఇదే వంతెన మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' యాత్ర కూడా 2013 జూన్ 4న రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా జిల్లాలోకి ప్రవేశించింది. తాజాగా, మాట తిప్పని మడమ తిప్పని యువనేత జగన్ ఇదే వంతెనపై నుంచి నడుస్తూ తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించి చారిత్రక ఘట్టానికి నాంది పలికారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నేతలు అకుంఠిత దీక్షతో చేపట్టిన పాదయాత్రలు తమ జిల్లాలోకి ప్రవేశించడం పై తూర్పు గోదావరి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేడు తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కొవ్వూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం గోష్పాద క్షేత్రం చేరుకున్న జగన్.... గోదారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ కు షోష్పాద క్షేత్రం వేద పండితులు సంప్రదాయ స్వాగతం పలికారు. వారు వేద మంత్రాలు చదువుతుండగా.....గోదారమ్మకు జగన్ హారతినిచ్చారు. ఆ తర్వాత ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న జగన్ ప్రత్యేక పూజలు చేశారు. రాజమండ్రి లోని ప్రసిద్ధ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా జగన్ తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టారు. నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న చీరలను ధరించిన 150 మంది మహిళలు - జగన్ కు 150 గుమ్మడికాయలతో దిష్టి తీసి, హారతిచ్చి, జిల్లాలోకి ఘన స్వాగతం పలికారు. జగన్ తో పాటు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి - జిల్లా నేతలు - అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జననేత వెంట నడిచారు. జగన్ బ్రిడ్జిపై నడుస్తున్న సమయంలో గోదావరిలో వైకాపా జెండాలతో అలంకరించిన 600 పడవలు పాదయాత్రను అనుసరిస్తున్నాయి. బ్రిడ్జి రెయిలింగ్ పై 7 అడుగుల ఎత్తు - 3.5 కిలోమీటర్ల పొడవైన వైకాపా జెండా అందరినీ ఆకట్టుకుంటోంది. వంతెనపై జగన్ నడుస్తుండగా.....పార్టీ జెండాల ఎయిర్ బెలూన్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొద్ది సేపట్లో జగన్ కోటిపల్లి బస్టాండ్ లో ఏర్పాటు చేసిన మూడంచెల వేదికపై నుంచి ప్రసంగించనున్నారు.