కొందరు ప్రముఖుల్ని లక్షలాది మంది అభిమానించటం.. ఆరాధిస్తుంటారు. కానీ.. అంతమందిలోనూ కొద్ది మంది భిన్నమైన వారు ఉంటారు. తాము అభిమానిస్తున్న వారి కోసం తమను తాము త్యాగం చేసుకునేందుకు సైతం వెనుకాడరు. తాజాగా చెప్పే ఉదంతం అలాంటిదే. జగన్ మీద అభిమానం ఉన్న ఒక వీరాభిమాని ఉదంతం తెలిస్తే నోట మాట రాదంతే.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వాసి శ్రీరామచంద్రన్నకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నా.. జగన్ అన్నా విపరీతమైన ఇష్టం. ఆ మాటకు వస్తే పిచ్చి అభిమానం అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జగన్ సీఎం కావాలన్న ఉద్దేశంతో గడిచిన నలభై రోజులుగా ఆయన ఉపవాసం ఉంటున్నారు.
ఏప్రిల్ 19 నుంచి ఇప్పటివరకూ ఉపవాసం ఉంటున్న ఆయనకు జగన్ ను సీఎంగా చూడటమే తన ఆశయంగా చెబుతుంటారు. ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్ ఇడుపులపాయకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అతను.. ఇడుపులపాయలోని వైఎస్ జగన్ ను కలిసేందుకు అక్కడకు వెళ్లారు.
హైదరాబాద్ లో ఆర్టిస్టుగా పని చేస్తూ బతికే శ్రీరామచంద్రన్న ఎంతో ఆశతో ఇడుపులపాయకు వెళ్లారు. అయితే.. అనుకోని విధంగా జగన్ షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకోవటంతో ఇడుపులపాయలోని విశ్రాంతి భవనం వద్దకు రాకుండానే జగన్ నేరుగా విజయవాడకు వెళ్లిపోయారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆయన విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ ను కలుస్తానన్న ఆశతో ఆయన విజయవాడ వెళ్లారు. తన కోసం ఇంతలా తపించే వారి గురించి జగన్ కు తెలిస్తే సంతోషపడిపోవటం ఖాయం. ఆయన దృష్టికి ఇతగాడి ఉదంతం వెళితే.. తనను కలిసేందుకు అట్టే కష్టాలు పడకుండా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. మరి.. ఈ విషయాన్ని జగన్ దృష్టికి చేరుతుందా అన్నది చూడాలి.