కేర‌ళ మాదిరి వ‌ర్షాలైతే.. ఏపీ స‌చివాల‌యం ప‌రిస్థితేంది?

Update: 2018-08-21 05:04 GMT
నిద్ర లేచించి మొద‌లు ఆర్థిక క‌ష్టాల‌ను అదే ప‌నిగా వినిపించే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఖ‌ర్చులు పెట్టే విష‌యానికి వ‌చ్చిన‌ప్పుడు అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తారు. చార్టెడ్ ప్లైట్లు.. ఏడు న‌క్ష‌త్రాల హోట‌ళ్లు.. ఇలా చెప్పుకుంటే బాబు గారి ఖ‌ర్చుల‌కు అంతుపొంతు ఉండ‌దు.

విభ‌జ‌న కార‌ణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాలి. ఇందుకు భిన్నంగా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఖ‌ర్చు చేసే తీరు చంద్ర‌బాబులో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ఏదైనా ప‌నికి చేసిన ఖ‌ర్చుకు మించిన ప్ర‌చార‌మే ఎక్కువ‌గా జ‌రిగిన‌ట్లుగా క‌నిపిస్తూ ఉంటుంది. బాబు దుబారా చిట్టాను తాజాగా జ‌గ‌న్ విప్పారు.

రాజ‌ధాని శంకుస్థాప‌న‌.. తాత్కాలిక నిర్మాణాలు అంటూ బాబు వేల కోట్ల రూపాయిల్ని దుబారా చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. బాబు దుబారాకు సంబంధించిన శాంపిల్ లెక్క‌ను జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. దేవుడి పేరుతో కృష్ణా.. గోదావ‌రి పుష్క‌రాలు అంటూ రూ.3200 కోట్లు..  త‌ర‌చూ విదేశీ ప‌ర్య‌ట‌న‌లు అంటూ ప్రైవేటు విమానాల్లో వెళ్లేందుకు రూ.120 కోట్లు.. పోల‌వ‌రం బ‌స్సు యాత్ర పేరుతో రూ.22.5 కోట్లు.. రాని పెట్టుబ‌డుల కోసం విశాఖ‌లో నిర్వ‌హించిన భాగ‌స్వామ్య స‌ద‌స్సు కోసం రూ.150 కోట్లు దుర్వినియోగం చేసిన‌ట్లుగా ఆయ‌న పేర్కొన్నారు.

గ‌డిచిన నాలుగేళ్లలో బాబు స‌ర్కారు చేసిన దుబారా ఖ‌ర్చులు రూ.6వేల కోట్ల వ‌ర‌కూ ఉంటాయ‌ని మండిప‌డ్డారు. పైపైన చూసి చెబితేనే బాబు దుబారా ఇంత భారీగా ఉంటే.. కాస్త లోతుగా అధ్య‌య‌నం చేస్తే మ‌రెంత ఎక్కువ‌గా ఉంటుందోన‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఎవ‌రెన్ని చెప్పినా త‌న ఖ‌ర్చుల విష‌యంలో మాత్రం కోత పెట్ట‌ని బాబు.. ఏపీ ఆర్థిక ప‌రిస్థితికి భారంగా మారిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ ఖ‌ర్చుల లెక్క ఇలా ఉంటే.. బాబు ఆడంబ‌రంగా చెబుతూ నిర్మించిన నిర్మాణాల నాణ్య‌త మీద ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాత్కాలిక స‌చివాల‌యం పేరుతో ఆఘ‌మేఘాల మీద.. ఉరుకులు ప‌రుగులు పెట్టించి మ‌రీ నిర్మించిన స‌చివాల‌యం సినిమా సెట్టింగ్‌ ను త‌ల‌పిస్తున్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తుతూ.. కేర‌ళ త‌ర‌హాలో కానీ ఏపీలో వ‌ర్షాలు ప‌డితే.. ఏపీ స‌చివాల‌యం కూలిపోయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదంటూ మండిప‌డ్డారు. రెండు రోజుల వ‌ర్షాల‌కు స‌చివాల‌యంలోని ప‌లువురు మంత్రుల ఛాంబ‌ర్ల లీకుల‌కు గురి కావ‌టం.. వ‌ర్ష‌పు నీటితో నిండ‌టాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. 
Tags:    

Similar News