జ‌గ‌న్ చేసిన బ్లాక్ డే విమ‌ర్శ ఎంత నిజ‌మంటే..?

Update: 2017-04-02 12:30 GMT
తెలియ‌క త‌ప్పులు చేయ‌టం ఒక ఎత్తు. తెలిసి త‌ప్పు చేయ‌టానికి మించిన త‌ప్పు మ‌రొక‌టి ఉండ‌దు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇప్పుడు చేస్తున్న‌ద‌దే. నిత్యం.. విలువ‌ల గురించి మాట్లాడే చంద్ర‌బాబు.. త‌న‌ను న‌మ్మి వారిని వ‌దిలేసి.. వేరే పార్టీ నుంచి వ‌చ్చిన వారికి పెద్ద‌పీట వేయ‌టం.. వారికి మంత్రి ప‌ద‌వుల్ని కేటాయించ‌టంపై ఏపీలోని ప‌లు వ‌ర్గాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి ప‌ద‌వి ఎలా ఇస్తార‌ని.. ఒక పార్టీ బీఫాం మీద గెలిచిన వారికి మ‌రో పార్టీ నేతృత్వంలోని ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వులు ఎలా సాధ్య‌మ‌న్న ప్ర‌శ్న‌ను ప‌లువురు ప్ర‌శ్నిస్తున్న వేళ‌.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నాస్త్రాల్ని సంధించారు.

పార్టీ ఫిరాయించిన న‌లుగురు ఎమ్మెల్యేల‌ను ఏపీ క్యాబినెట్‌ లో తీసుకోవ‌టం రాజ్యాంగానికి.. రాష్ట్రానికి జ‌రిగిన ఘోర అవ‌మానంగా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అభివ‌ర్ణించారు. ఆదివారం జ‌రిగింది క్యాబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ కాద‌ని.. ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో అదో బ్లాక్ డేగా అభివ‌ర్ణించారు. పార్టీ ఫిరాయింపుదారుల‌కు పెద్ద‌పీట వేస్తూ.. వారికి మంత్రి ప‌ద‌వులు అప్ప‌గిస్తూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంపై జ‌గ‌న్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన వారిని మంత్రివ‌ర్గంలోకి తీసుకోవ‌టం రాజ్యాంగ‌ప‌రంగా ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిహాసం చేయ‌టంగా అభివ‌ర్ణించిన జ‌గ‌న్‌..2014 ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌ఫున‌.. ఆ పార్టీ ఇచ్చిన బీఫారంతో గెలిచిన నేత‌లంతా ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కారులో మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌టాన్ని తీవ్రంగా ఖండించారు.

ఈ బ‌రితెగింపు చ‌ర్య‌పై ధ్వ‌జ‌మెత్తిన జ‌గ‌న్‌.. పార్టీ బీఫాంను.. యాంటీ డిఫెక్ష‌న్ చ‌ట్టాన్ని ఉల్లంఘించిన‌వారేన‌ని స్ప‌ష్టం చేశారు. స్పీక‌ర్ అండ‌దండ‌ల‌తో ముఖ్య‌మంత్రి ఈ రాజ్యాంగ ఉల్లంఘ‌న కార్య‌క్ర‌మానికి క‌ర్త‌.. క‌ర్మ‌.. క్రియ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించార‌న్నారు.  రాజ్యాంగాధిప‌తిగా రాష్ట్రంలో ఉండాల్సిన గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌రుండి మ‌రీ రాజ్యాంగ ఉల్లంఘ‌న కార్య‌క్ర‌మంలో పాలు పంచుకున్నార‌న్నారు. తాజాగా జ‌రిగిన ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వాన్ని మేధావులు.. సామాన్యులు.. రాజ‌కీయ వ‌ర్గాలు తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నాయ‌న్న జ‌గ‌న్‌.. ఇలాంటి వాటిని చూస్తూ ప్ర‌జ‌లు ఎక్కువ‌కాలం భ‌రించ‌లేర‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News