బీజేపీ పై జగ‌న్ స్వ‌రం పెరుగుతోంది..!

Update: 2015-08-11 12:24 GMT
ప్రత్యేక హోదాపై కేంద్రం ఏపీ ప్రజలను మోసం చేస్తోందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు.  ఆయ‌న ఓ స‌రికొత్త అనుమానాన్ని కూడా తాజాగా రేకెత్తించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా రాకుండా పీఎం మెదీ వెన‌క ఎవ‌రైనా ఉన్నారేమో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఇటీవ‌ల తిరుప‌తిలో మృతిచెందిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త మునికోటి కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీకి ప్ర్య‌తేక హోదా ఇస్తామ‌న్న కేంద్రం ఇప్పుడు కావాల‌నే కాల‌యాప‌న చేస్తోంద‌ని...ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యానికి కేంద్రం వ‌చ్చేసింద‌న్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌కుండా ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతోంద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు.

నిన్న‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో పెద్ద‌గా స్పందించ‌ని జ‌గ‌న్ ఒక్క‌సారిగా టోన్ పెంచారు. ఢిల్లీలో దీక్ష‌తో పాటు మునికోటి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన‌ప్పుడు కూడా బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ద‌ని చెప్పి గ‌ట్టిగానే త‌న వాయ‌స్‌ ను వినిపిస్తున్నారు. ఈ అంశంపై తాము పోరాడుతూనే ఉంటామని, కేంద్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబును నిలదీస్తుంటామని చెప్పారు.  ఇంత‌కు జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఏపీకి ప్ర‌త్యేక హోదా రాకుండా మోదీపై కొంద‌రు ఒత్తిడి చేస్తున్నార‌న్న ఆయ‌న.. ఈ కుట్ర ఎవరు చేసుంటారో చెప్ప‌లేదు.

Tags:    

Similar News