పుట్టిన రోజున జగన్ కి గిఫ్ట్ అందరూ ఇస్తారు. ఇవ్వాలి కూడా. అయితే తనను గ్రీట్ చేసిన వారిని తిరిగి గ్రీట్ చేయడం సహజంగా జగన్ సహా ఎవరైనా చేస్తారు. ఇక తన పుట్టిన రోజు వేళ బాపట్ల జిల్లా యడ్లపాడుకు జగన్ వచ్చి ఎనిమిదవ తరగతి విద్యార్ధులకు ట్యాబ్స్ పంపిణీ చేశారు. మరో వైపు చూస్తే ఆయన యడ్లపాడు చేరుకున్నపుడు స్థానిక ఎమ్మెల్యేలు నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా పలువురు నాయకులు జగన్ కి శాలువాలు తెచ్చి సత్కరించాలని చూశారు. అయితే జగన్ వారు తెచ్చిన శాలువాలను తిరిగి వారి మెడకే వేసి ఎదురు సన్మానం చేశారు. అలా తన పుట్టిన రోజున ఆయన ఎదురిచ్చారన్న మాట. ఇక జగన్ యడ్లపాడులో ఏకంగా గంట సేపు స్పీచ్ ఇచ్చారు. ఈ మధ్య జగన్ స్పీచ్ నిడివి కూడా బాగా పెరుగుతోంది. మరి ఎన్నికలు వస్తున్నాయని అనుకున్నారో లేక ఎక్కువగా తమ ప్రభుత్వం పార్టీ గురించి తామే చెప్పుకోవాలనుకుంటున్నారో కానీ జగన్ స్పీచులు కూడా గంటల తరబడి సాగుతున్నాయి.
ఇక యడ్లపాడు స్పీచ్ అంతా జగన్ అభివృద్ధి సంక్షేమం గురించే ప్రస్తావించడం విశేషం. నిజానికి జగన్ స్పీచ్ ని జాగ్రత్తగా గమనిస్తే ఆయన స్పీచ్ లో మొదటి భాగం అంతా తమ ప్రభుత్వం గురించి తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకోవడం ఉంటుంది. చివరాఖరులో అయిదు నుంచి పది నిముషాలు మాత్రం విపక్షాల మీద ఘాటైన విమర్శలు పంచులు ఉంటాయి.
అయితే యడ్లపాడు స్పీచ్ మొత్తం చూసినా కనీసమాత్రంగా కూడా విపక్షాల గురించి జగన్ ఎక్కడా ప్రస్తావించకపోవడం విశేషం. పిల్లల చదువులు తమ పధకాలు ఇలా జగన్ స్పీచ్ అంతా అలాగే సాగిపోయింది. పేదలకు అసలైన ఆస్తి చదువు మాత్రమే అని జగన్ చెప్పుకొచ్చారు.
వారికి ఇంగ్లీష్ మీడియం చదువులు తాను ఇవ్వాలనుకుంటే చాలా మంది వ్యతిరేకించారు అని ఒక్క మాట అన్నారు. చదువులో సమానత్వం తీసుకువస్తే దేశం రాష్ట్రం బాగుంటుంది అని జగన్ చెప్పుకొచ్చారు. అందుకే తమ ప్రభుత్వం విద్యా రంగం మీదనే ఎక్కువ ఖర్చు చేస్తోందని ఆయన వివరించారు. ఆరేడు వందల కోట్లతో ట్యాబ్స్ ని తమ ప్రభుత్వం ఖర్చు చేసి మరీ విద్యార్ధులకు ఇస్తోందని ఇది డిజిటల్ యుగమని దానికి ధీటుగా తట్టుకుని ప్రతీ పేద విద్యార్ధి ఎదగాలని ఆయన కోరుతున్నారు.
ఇలా జగన్ స్పీచ్ కేవలం ప్రభుత్వం గురించే చెప్పుకుంటూ సాగిపోయింది తప్ప ఏ ఒక్కరి గురించో కానీ ఏ విపక్ష ఖ నాయకుడిని విమర్శించడం కానీ చేయలేదు. మరి జగన్ మార్క్ పంచులు ఎపుడూ చంద్రబాబు పవన్ ల మీద పడుతూ ఉంటాయి. ఈసారి ఎందుకు అలా చేశారు అంటే పుట్టిన రోజు పూట విపక్షానికి ఇచ్చిన గిఫ్ట్ అని సరదాగా అంతా అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.