అవినీతి, అశ్రిత పక్షపాతం లేకుండా పాలిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వైఎస్ జగన్ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆచరణలోనూ చూపిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకే షాకిచ్చిన తీరు వైసీపీలో చర్చనీయాంశమైంది. సిఫారసులతో ఎమ్మెల్యేలు నియమాకం చేసిన పోస్టులను ఊడబూకించిన జగన్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి..
నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేల సిఫారసులతో తాజాగా నియమించిన విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్లను జగన్ ఆదేశాలతో తొలగించడం సంచలనంగా మారింది.. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ లైన్ మెన్ (జేఎల్ ఎం) గ్రేడ్ 2 ఎంపికలు నిర్వహించి 541 మందిని సబ్ స్టేషన్లలో నియమించారు. అయితే విధుల్లో ఉన్న 110 మంది షిఫ్ట్ ఆపరేటర్లు జేఎల్ఎం గ్రేడ్2 పోస్టులకు ఎంపిక కావడంతో ఆ పోస్టులు ఖాళీ అయ్యాయి.
అయితే ఇలా ఖాళీ అయిన పోస్టులను పారదర్శకంగా విద్యుత్ శాఖ ఎంపిక చేయాలి. నిరుద్యోగులకు పరీక్ష నిర్వహించి తీసుకోవాలి. కానీ ఖాళీ అయిన పోస్టులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సిఫారసులతో ఒత్తిడితో భర్తీ చేయడం వివాదాస్పదమైంది.
ఎమ్మెల్యేల తీరుతో హతాషులైన నిరుద్యోగులు ఈ విషయంపై ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న సీఎం జగన్ సీరియస్ గా స్పందించారు. ఎమ్మెల్యేల సిఫారసులతో నియమించిన వారిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. అధికారులు తాజాగా వారిని తొలగించారు. ఇలా ఎమ్మెల్యేల సిఫారసులతో నియామకం అయిన వారిని జగన్ తొలగించడం వైసీపీ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఖాళీ అయిన షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను పారదర్శకంగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా భర్తీ చేసి నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని జగన్ ఆదేశించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీ ఎమ్మెల్యేలకు షాకివ్వగా.. నిరుద్యోగులు మాత్రం జగన్ కు నీరాజనాలు పలుకుతున్నారు.