మూడు రోజులు విశాఖలోనే క్యాంపా ?

Update: 2022-07-26 05:46 GMT
విశాఖపట్నంకు సంబందించి జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆగస్టు తర్వాత నుంచి వారంలో మూడు రోజులు జగన్ వైజాగ్ లో క్యాంపు వేయాలని డిసైడ్ అయ్యారట.

మూడు రాజధానుల కాన్సెప్టును జగన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. విశాఖను పరిపాలనా రాజధానిగాను, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. ఇపుడున్న అమరావతి శాసన రాజధానిగా కంటిన్యూ అవుతుందని జగన్ అసెంబ్లీలోనే ప్రకటించారు.

మూడు రాజధానుల కాన్సెప్టును అమలుచేయటానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నపుడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు కోర్టులో కేసులేవేశారు. టీడీపీ నేతలతో పాటు అమరావతి ప్రాంతంలోని కొందరు కోర్టులో కేసులు వేసిన కారణంగానే ఆ కాన్సెప్టుపై ప్రభుత్వం ముందుకెళ్ళలేకపోయింది. ఇదే సమయంలో అమరావతిలో రాజధానిని ఆరుమాసాల్లో నిర్మించాల్సిందే అని హైకోర్టు తీర్పిచ్చింది. అయితే ఆ తీర్పును అమలు చేయటం కష్టమని ప్రభుత్వం మళ్ళీ రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది.

సరే మూడు రాజధానుల కాన్సెప్టు వివాదాల్లో పడింది కాబట్టి తాజాగా తన క్యాంపాఫీసును మాత్రమే వైజాగ్ కు తీసుకెళ్ళాలని జగన్ అనుకున్నారట. వారంలో మూడు రోజులు విశాఖలోనే కూర్చోబోతున్నారని సమాచారం. రాజధాని తరలింపు అంటే సాంకేతిక సమస్యలు వస్తాయి కానీ క్యాంపు ఆఫీసును తరలిస్తున్నారంటే ఎవరు అడ్డుకునే అవకాశం లేదు. ముఖ్యమంత్రిని ఇక్కడే కూర్చుని పనిచేయాలని ఏ కోర్టు కూడా చెప్పలేదు. ఈ పాయింట్ మీదే క్యాంపాఫీసును వైజాగ్ తరలించేందుకు జగన్ రెడీ అయిపోయారు.

ప్రస్తుతం సీఎంవోలో ఉన్న అధికారుల్లో ఎవరెవరిని తనతో వైజాగ్ తీసుకెళ్ళాలనే విషయాన్ని కూడా జగన్ డిసైడ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యక్షంగా నిర్వహించాల్సిన సమీక్షలన్నింటినీ అమరావతి నుండే మొదటి నాలుగు రోజుల్లో పూర్తి చేయబోతున్నారట.

తర్వాత రెండురోజులు వైజాగ్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు చేయబోతున్నారని అవసరమైతే మూడోరోజు కూడా అక్కడినుండే సమీక్షలు చేస్తారని సమాచారం. ఆగష్టులో మంచి రోజు చూసుకుని వైజాగ్ వెళ్ళటానికి జగన్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News