ఐదు రోజులకు 1.2కిలోల బరువు తగ్గారు

Update: 2015-10-11 05:14 GMT
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు దగ్గరి నల్లపాడులో నిరవధిక దీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన.. నీరసించినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నారు.

జగన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు సమీక్షిస్తున్నారు. దీక్ష ప్రారంభించిన రోజు నుంచి పోలిస్తే.. నీరసిస్తున్న జగన్ కు ఆరోగ్య సమస్యలు చిన్నగా మొదలవుతున్నాయి. బీపీ పడిపోవటం.. షుగర్ లెవల్స్ తగ్గిపోవటంతో పాటు.. బరువు తగ్గుతున్నారు. ఐదో రోజుకు చేరుకున్న ఆయన నిరవధిక దీక్షలో భాగంగా గడిచిన ఐదు రోజుల్లో 1.2కేజీల బరువు తగ్గినట్లు చెబుతున్నారు.

దీక్ష ప్రారంభించే రోజున 75 కిలోలు ఉన్న జగన్.. ప్రస్తుతం (శనివారం రాత్రి వేళకు) 73.8 కేజీలున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రోజుకు రెండు.. మూడుసార్లు వైద్య పరీక్ష నిర్వమిస్తున్న జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్న విషయాన్న వెల్లడిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా.. ఏం చేసినా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సానుకూలంగా లేని నేపథ్యంలో.. జగన్ మరెన్ని రోజులు దీక్ష కొనసాగిస్తారన్నది ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News