గంటాను ఓడించేందుకు బిగ్ ప్లాన్ లో జగన్

Update: 2022-11-16 07:24 GMT
ఓటమి ఎరగని నాయకుడుగా గత రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో టీడీపీ నేత,  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. ఆయన  ఇప్పటిదాకా ఒకసారి ఎంపీగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు మంత్రిగా పనిచేసారు. అయితే గంటా ఎన్ని పార్టీలు మారినా ఎన్ని చోట్ల నుంచి పోటీ చేసిన ఓడలేదు. ఆఖరుకు 2919 ఎన్నికల్లో జగన్ వేవ్ బలంగా ఉన్నా కూడా గంటా గెలవడం విశేషం.

దాంతో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ నార్త్ సీటు మీద జగన్ టార్గెట్ చేశారు. ఈ సీటుని 2024 ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో గెలుచుకోవాలని జగన్ పట్టుదల మీద ఉన్నారు. గంటా విషయానికి వస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా తొలి రెండేళ్ళూ నియోజకవర్గం వైపుగా పెద్దగా చూడలేదు. ఇక గత ఏడాది ప్రారంభంలో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

అది స్పీకర్ వద్ద పెండింగులో ఉంది. మరో వైపు చూస్తే గంటా టీడీపీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నది తెలియడంలేదు. ఆయన రాజకీయం అలా ఉంటే విశాఖ నార్త్ నుంచి గంటాను ఎలాగైనా ఓడించాలని వైసీపీ భావిస్తోంది.

ఇక గంటా మీద 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ నేత కేకే రాజుని అక్కడ ఇంచార్జిగా జగన్ నియమించారు. ఆయనకు నెడ్ క్యాప్ చైర్మన్ పదవిని కూడా ఇచ్చారు. దాంతో ఆయన ఎమంల్యేగా నార్త్ కి ఉన్నారు. జగన్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్న కే కే రాజునే మరోసారి వచ్చే ఎన్నికల్లో పోటీకి దించాలని జగన్ చూస్తున్నారు.

తాజాగా సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన సమీక్షలో విశాఖ నార్త్ నుంచి గంటాకు పోటీగా నిలిచే అభ్యర్ధిని జగన్ నిర్ణయించారు. ఆయనే కేకే రాజు.అంటే కేకే రాజుకు మరోదఫా టికెట్ ఇవ్వడానికి జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు. విశాఖలో ఆయన డైనమిక్ లీడర్ గా పేరు పొందారు. అలాగే విశాఖ నార్త్ లో క్షత్రియుల ప్రభావం కూడా బాగానే ఉంది.

దాంతో అన్ని రకాలుగా ఉన్న అవకాశాలను పరిశీలించిన జగన్ రాజునే తమ అభ్యర్ధిగా డిక్లేర్ చేశారని అంటున్నారు. దీని మీద పార్టీ నేతల అభిప్రయాన్ని కూడా ఆయన తీసుకుని ఖరారు చేశారు అని తెలుస్తోంది.ఇక ఓడిన మరుసటి రోజు నుంచే కేకే రాజు విశాఖ నార్త్ లో జనంతో ఉంటున్నారు. ఆయనే ప్రజా సమస్యల మీద అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. ప్రజలు కూడా సమస్యలను ఆయనకే చెప్పుకుంటున్నారు. మొత్తానికి చూస్తే కేకే రాజు 2024 ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు అని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

మరి గంటా కనుక నార్త్ నుంచి మరోసారి పోటీ చేస్తే ఈ ఇద్దరి మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు. గంటా చాణక్య రాజకీయం తో పోటీ పడి ఈసారి అయినా నార్త్ కి రాజుగా కేకే రాజు నిలుస్తారా గెలుస్తారా అన్నది చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News