ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు..జగన్ ఆహ్వానాలు

Update: 2019-05-29 07:50 GMT
ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మహామహులు హాజరు కానున్నారు. అనూహ్యమైన కొందరు వ్యక్తులు కూడా హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ప్రముఖ పార్టీల నేతలకు ఆహ్వానం పంపించారు.

ప్రధాని నరేంద్రమోడీ - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి ఆప్తులను స్వయంగా ఆహ్వానించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు - చిరంజీవి - పవన్ కళ్యాణ్ తదితర తెలుగు ప్రముఖులను కూడా స్వయంగా ఆహ్వానించారు.

ప్రముఖ  పార్టీల అధినేతలు స్టాలిన్ - ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ - కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి - బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి వారికి అధికారిక ఆహ్వానాలు సీఎం కార్యాలయం నుంచి వెళ్లాయి. వీరిలో కొందరిని జగన్ ఫోన్ ద్వారా ఆహ్వానించారు.

బీహార్ ముఖ్యమంత్రిని పిలవడానికి ప్రశాంత్ కిషోర్ కారణం. పీకే జేడీయు నేత మరియు జగన్ కు సలహాదారు. అందుకే నితీష్ కు ఆహ్వానం అందడమే కాదు - ఆయనను తప్పకుండా తీసుకురావాలని జగన్ పీకేకు పదేపదే చెప్పారట.

వీరందరితో పాటు గతంలో కీలక సందర్భాల్లో జగన్ కు మద్దతు పలికిన సీపీఎం - సీపీఐల జాతీయ కార్యదర్శులు సీతారాం ఏచూరి - సురవరం సుధాకర్ రెడ్డిలను జగన్ అధికారిక ఆహ్వానం పంపించి - ఫోన్ లో కూడా ఆహ్వానించారు. వీరితో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు - కార్పొరేట్ ప్రముఖులు హాజరు కానున్నారు.
Tags:    

Similar News