మరోసారి హైకోర్టు మెట్లు ఎక్కిన సీఎం జగన్..ఎందుకంటే?

Update: 2020-01-27 10:59 GMT
సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో సుదీర్ఘకాలంగా సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి అందరికి  తెలిసిందే. సీఎం అయ్యాక వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, సీబీఐ న్యాయస్థానంలో ఆయనకు చుక్కెదురైంది. సీబీఐ కోర్టు తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపును నిరాకరించడాన్ని జగన్ సవాల్ చేశారు. తన అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణ నుంచి వ్యక్తిగత హాజరుపై మినహాయింపు దక్కకపోవడంతో సీఎం జగన్ తాజాగా  హైకోర్టును ఆశ్రయించారు.

ఏపీ ముఖ్యమంత్రిగా పరిపాలనాపరమైన విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత తనపై ఉందని జగన్ తన పిటిషన్‌ లో తెలిపారు. అందుకే సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ హైకోర్టులో ఇదే పిటిషన్ వేశారు. అయితే సీబీఐ కోర్టు విచారణకు వ్యక్తగతంగా హాజరు కావాలంటూ అప్పట్లో హైకోర్టు ఆదేశించింది. కానీ , ఇప్పుడు జగన్ ఆంధప్రదేశ్ కి సీఎం కావడంతో హైకోర్టు ఏంచెప్తుందో అని అందరూ చర్చించుకుంటున్నారు . దీనిపై త్వరలోనే న్యాయస్థానం విచారణ జరిపే అవకాశం ఉంది.
Tags:    

Similar News