రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు పైచేయి సాధిస్తారో చెప్పడం కష్టం. పైకి మాత్రం ఏమీ తెలియని వారిలో ఉంటూనే రాజకీయంగా దూకుడు ప్రదర్శించడం రాజకీయాల్లో నేటి నేతల ప్రధాన లక్షణంగా మారిపోయింది. తాజాగా వైసీపీ అధినేత - ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా వేసిన అడుగుకు టీడీపీ నాయకులు చిక్కుకుపోయారు. ముఖ్యంగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన రాజధాని అంశాన్ని జగన్ ఎంచుకున్నారు. నిజానికి రాజధానిని అమరావతిలో నిర్మించాలనేది టీడీపీ అధినేత - అప్పటి సీఎం చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ఆయన ఎవరితోనూ చర్చించలేదు. కనీసం ప్రధాన ప్రతిపక్షం - 67 మంది ఎమ్మెల్యేలు (అప్పటికి ) ఉన్న వైసీపీతోనూ రాజధానిపై చర్చ చేయలేదు.
2014లో కేంద్రం ఏపీ రాజధాని ఎంపికపై వేసిన శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను సైతం పక్కన పె ట్టి.. చంద్రబాబు కేవలం ఇద్దరుతో ఓ కమిటీ వేసి.. రాజధానిని ఏకపక్షంగా ఎంపిక చేసిన నేపథ్యంలోనే ఇ క్కడ ఏదో జరుగుతోందని జగన్ పెద్ద ఎత్తున ఆరోపించారు. అదే సమయంలో కమిటీ నివేదిక విషయాన్ని కూడా తన మీడియాలో పెద్ద ఎత్తున హైలెట్ చేశారు. అయినా కూడా చంద్రబాబు తన ఇష్టానుసారంగా ముందుకు సాగారు. అయితే, తాజాగా - రాష్ట్రంలో మారిన జగన్ ప్రభుత్వం నేపథ్యంలో రాజధానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసలు జగన్.. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తారనే చర్చ ఎన్నికల సమయంలో నుంచి కూడా జరుగుతోంది.
అయితే, ఇటీవల జగన్ అమెరికా వెళ్లిన తర్వాత.. రాష్ట్రంలో కృష్ణా - గోదావరి నదులు పై రాష్ట్రాల్లో పెరిగిన భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లాయి. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలోకి కూడా నీరు వచ్చింది. దీనిని ప్రస్తావిస్తూ.. మంత్రి బొత్స సత్యనారాయణ.. రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఎంతో అనుభవం ఉన్న నాయకుడు - మాజీ మంత్రిగా కూడా చక్రం తిప్పిన నాయకుడు అయిన బొత్స రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున మేధావులను కూడా ఆకర్షించాయి. సామాన్య వర్గాల్లో కొంత వ్యతిరేకత వచ్చినా లోతుగా ఆలోచిస్తే అవి నిజమే. ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. రాజధాని ముంపు ప్రాంతం. శివరామకృష్ణ కమిటీ ఇక్కడ సిఫారసు చేయలేదు. పైగా కొండవీటి వాగు ఉన్న ప్రాంతం అనేది బొత్స విమర్శలు.
అయితే, దీనిని వ్యూహాత్మకంగా తెరమీదికి తీసుకువచ్చి - చంద్రబాబు వైఫల్యాలను ఎత్తి చూపాలని నిర్ణయించుకున్న వైసీపీకి..బొత్స వ్యాఖ్యలు బలాన్ని పెంచితే.. దీనిపై మౌనంగా ఉండి.. సాంకేతిక నిపుణులతోనే సమాధానం చెప్పిస్తే.. సరిపోయే ఈ విషయంలో తనంతట తానుగా జోక్యం చేసుకున్నారు టీడీపీ నాయకులు. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో జరిగిన అవకతవకలపై మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలోనే శివరామకృష్ణ కమిటీ నివేదిక ఎందుకు అమలు చేయలేదన్న వైసీపీ ప్రశ్నకు టీడీపీ నీళ్లు నమలాల్సి వచ్చింది. మొత్తానికి జగన్ వేసిన వలకు టీడీపీ చిక్కుకుందని అంటున్నారు పరిశీలకులు.