లాక్ డౌన్ తప్పులు..ప్రజలకు జగన్ ఊరట!

Update: 2020-05-24 04:41 GMT
మహమ్మారి విస్తరించిన వేళ ఆపదతోనే.. ఆకలి కేకలతోనో.. మందులు ఇతర అవసరాలతోనే రోడ్డెక్కిన చాలా మంది ప్రజల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అవన్నీ పోలీస్ స్టేషన్లలో కుప్పలుగా పడిఉన్నాయి. ఇప్పుడు లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఈ వాహనాలపై వాహనదారుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం వాహనదారులకు వరంగా మారింది.

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల విషయంలో మిగతా రాష్ట్రాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో కేసులు కూడా నమోదు చేశారు. దాదాపు 4.5 లక్షల వాహనదారులపై కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. అయితే ఈ కేసులు లక్షల్లో ఉండడంతో ఈ కోర్టు ద్వారా విచారణ జరుపుతున్నారు. ఏపీ సర్కార్ మాత్రం ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

సీఎం జగన్ పాలనకు సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఏపీలోని సీజ్ చేసిన వాహనాలపై జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వాహనదారుల నుంచి కేవలం రూ.100 జరిమానా మాత్రమే వసూలు చేయాలని.. మరోసారి నిబంధనలు ఉల్లంఘించమంటూ స్వీయ హామీ పత్రాన్ని తీసుకోవాలని పోలీసులకు శాఖకు ఆదేశాలిచ్చారు. వాహనాలను తిరిగి వారికి వెంటనే ఇచ్చేయాలని సూచించారు. దీంతో కోర్టుకు హాజరు కాకుండానే వాహనదారులు తమ వాహనాలను తీసుకునే సౌకర్యాన్ని జగన్ కల్పించారు.  

ఈ మేరకు సీజ్ చేసిన వాహన యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని డీజీపీ గౌతమ్ సవాంత్ తెలిపారు. పత్రాలు సమర్పించి ఫైన్ కట్టి తీసుకెళ్లాలన్నారు. ఏపీ వ్యాప్తంగా దాదాపు 70వేల పైచిలుకు వాహనాలు సీజ్ అయినట్లు డీజీపీ తెలిపారు. అప్పగింత ప్రక్రియ సులభతరం చేయడంపై ఏపీలోని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News