జగన్ పట్టుదల.. మరి వాళ్ల సంగతి ?

Update: 2019-11-14 10:57 GMT
అయితే ప్రతిపక్షాలు.. చంద్రబాబు, పవన్ లాంటి వాళ్లు జగన్ ముందరి కాళ్ల కు బంధం వేస్తున్నారు.. విమర్శలు చేస్తున్నారు. అయినా మొక్కవోని పట్టుదల తో జగన్ ఇంగ్లీష్ మీడియం చదువుల విషయం లో ముందుకెళ్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం పై పవన్ విమర్శలు చేసినా.. వెంకయ్య చీదరించినా.. బాబు అడ్డుకుంటున్నా కానీ విద్యార్థి లోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాల ల విద్యార్థులు జగన్ ను నీరాజనాలు పలుకుతున్నారు. తాజాగా ఒంగోలు సభ లో ఇంగ్లీష్ మీడియం వద్దన్న పవన్ , నారా లోకేష్ ను విద్యార్థులే కడిగేసిన తీరును మనం చూశాం.

అయితే జగన్ సంకల్పానికి ప్రధాన అడ్డు ఇంగ్లీష్ టీచర్లే. ప్రస్తుతం 47వేల ప్రభుత్వ పాఠశాల ల్లో ఉన్న టీచర్లు అంతా తెలుగు మీడియం టీచర్లే. వీరిని తీసి వేయడం సాధ్యం కాని పని. మరి జగన్ మొదలు పెట్టిన ఇంగ్లీష్ మీడియం చదువులు ముందుకెళ్లాలంటే ఇంగ్లీష్ మీడియం టీచర్లే కావాలి. ఇప్పటికిప్పుడు 47వేల మంది ఇంగ్లీష్ టీచర్ల ను భర్తీ చేయడం సాధ్యం కాని ముచ్చట.. ఇప్పుడున్న వారినీ తీసేయలేం. అలాగని వారి తోనే ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తే విద్యార్థుల భవిష్యత్తును పాడు చేసిన వారమవుతాం.

ఇంగ్లీష్ టీచర్స్ విషయం లో జగన్ ప్రభుత్వం ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి గా మారింది. ఇంగ్లీష్ టీచర్ల ను విద్యా వాలంటీర్లు గా తీసుకుంటుందా? లేక ప్రభుత్వమే డీఎస్సీ వేసి రిక్రూట్ చేస్తుందా అనేది వేచిచూడాలి. ఇంగ్లీష్ టీచర్స్ ను తీసుకోకుండా ఈ తెలుగు టీచర్ల కే ఇంగ్లీష్ మీడియం చెప్పమంటే మాత్రం నాణ్యత కొరవడి విద్యార్థులు చాలా నష్ట పోతారు.. ఇటు తెలుగు మీడియం, అటు ఇంగ్లీష్ మీడియం కు కాకుండా పోతారు. సర్కారు తీసుకున్న ఈ గొప్ప ఇంగ్లీష్ మీడియం చదువులు పట్టాలెక్కాలంటే ఇంగ్లీష్ టీచర్స్ అవసరం. మరి వారి విషయం లో జగన్ సర్కారు ఎలా ముందుకెళ్తుందనేది చూడాలి.


Tags:    

Similar News