కీలకమైన ఎన్నికల ప్రచారానికి తగ్గట్లు జగన్ పార్టీ తన ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా.. సమతూకం సాధిస్తూ.. గత ఎన్నికల వేళలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండేలా.. ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
జగన్ పార్టీకి స్టార్ క్యాంపైనర్లుగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ.. పార్టీ అధినేత జగన్.. ఆయన సోదరి షర్మిలతోపాటు.. ఇటీవల పార్టీలో చేరిన స్టార్ క్యాస్ట్ జయసుధ.. అలీ.. రాజారవీంద్ర.. తదితరులు ప్రచారగోదాలోకి దిగనున్నారు. జగన్.. విజయమ్మ.. షర్మిలా మూడు దిక్కులా ప్రచారం చేయనున్నారు. ఇక సినీ తారలు మరో దిక్కున ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఒకచోట ఎక్కువ.. మరో చోట తక్కువ అన్న భావన రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
రాయలసీమ.. కోస్తా.. గోదావరి జిల్లాలు.. ఉత్తరాంధ్ర.. ఇలా ఈ నాలుగు ప్రాంతాల్లోనూ ప్రముఖుల ఎన్నికల ప్రచారం సాగేలా ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జగన్ అత్యధిక నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని.. విజయమ్మ కాస్త తక్కువ స్థానాల్లో ప్రచారానికి రానున్నట్లు చెబుతున్నారు.
ఇక.. షర్మిల మాత్రం జగన్ మాదిరే ఎక్కువ స్థానాల్లో ప్రచారాన్ని నిర్వహించే వీలుంది. జగన్ అన్న వదిలిన బాణంగా షర్మిలకున్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. భావోద్వేగాన్ని రగిలించేలా విజయమ్మ.. సమరోత్సాహాన్నినింపేలా షర్మిల.. ఓటర్లను ప్రభావితం చేసేలా జగన్ తమ ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. వ్యూహంగా చూస్తే పక్కాగా ఉన్నట్లుగా చెప్పాలి.