జ‌గ‌న్ మ‌రో రాజీనామా అస్త్రం!

Update: 2018-04-23 06:32 GMT
హోదా సాధ‌న విష‌యంలో మొద‌ట్నించి ఒకే మాట చెబుతున్న ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంటున్నారా? అంటే అవున‌న్న మాట వినిపిస్తోంది. హోదా కోసం త‌న ఎంపీల చేత రాజీనామా చేయించిన జ‌గ‌న్‌.. కేంద్రానికి త‌న నిర‌స‌న తెల‌ప‌ట‌మేకాదు.. దేశ రాజ‌ధానిని వేదిక‌గా తీసుకొని హోదాపై నిర‌స‌న దీక్ష‌ను చేప‌ట్టారు. ఏపీకి జ‌రిగిన అన్యాయం దేశ వ్యాప్తంగా తెలిసేలా చేయ‌గ‌లిగారు.

హోదాపై పోరాటాన్ని మ‌రింత ఉధృతం చేసేందుకు వీలుగా జ‌గ‌న్ తాజాగా కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాల‌న్న యోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా  హోదాపై కేంద్రం నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తే స‌రి. లేని ప‌క్షంలో త‌మ ఎంపీలు స‌మావేశాల ఆఖ‌రు రోజున రాజీనామా చేస్తార‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. అదే విధంగా త‌న ఎంపీల చేత రాజీనామా చేయించి తాను చెప్పేదే చేస్తాన‌న్న విష‌యాన్ని మ‌రోసారి నిరూపించారు.

హోదా సాధ‌న కోసం ఏపీ అధికార‌ప‌క్షం చేస్తున్న దొంగ దీక్ష‌ల నేప‌థ్యంలో ఈ నెల 30న విశాఖ‌లో వంచ‌న పేరిట దీక్ష చేయాల‌ని డిసైడ్ చేసిన జ‌గ‌న్.. త‌న ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించ‌టం ద్వారా ఏపీ అధికార‌ప‌క్షంపై మ‌రింత ఒత్తిడి పెంచ‌టంతో పాటు.. కేంద్రం తీరుపై త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

హోదా సాధ‌న విష‌యంలో ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో నిర‌స‌న చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చూస్తూ.. దాని బాట‌లో ప‌య‌నిస్తున్న టీడీపీ.. తాజాగా జ‌గ‌న్ సంధించాల‌ని భావిస్తున్న ఎమ్మెల్యేల రాజీనామా అస్త్రానికి బాబు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News