ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదని ఊరికే అనలేదు. అలాంటి వాటితో ఇబ్బందే తప్పించి మరింకేమీ కాదు. తాను అనుకున్నది జరగటం లేదు కాబట్టి.. తన చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి.. తనకు నచ్చని వాటిని రద్దు చేయాలన్న ఆలోచన ఓకే అయినా.. అలాంటి వాటి అమలు మన దేశంలో అంత తేలికైన విషయం కాదు.
రాజ్యాంగంలో ఉన్న పరిమితులు.. పాలకులు తమకు తోచినట్లుగా వ్యవహరించేందుకు వీల్లేని రీతిలో తయారు చేసిన రాజ్యాంగ వ్యవస్థలు దేశంలో చాలానే ఉన్నాయి. అవే.. మొండిగా తీసుకున్న నిర్ణయాల విషయంలోనూ వెనక్కి తగ్గేలా చేస్తాయి.
వ్యవసాయ చట్టాలకు సంబంధించి మూడు కొత్త చట్టాల్ని తీసుకొచ్చిన మోడీ సర్కారుపై వ్యతిరేకత వ్యక్తమైనా మోడీ పరివారం వెనక్కి తగ్గలేదు. చివరకు.. ఆయనే తగ్గక తప్పలేదు. తాజాగా మూడు రాజధానుల విషయంలోనూ జగన్ ప్రభుత్వం వెనకడుగు వేయక తప్పలేదు.
సంచలనంగా మారిన ఈ నిర్ణయం నేపథ్యంలో మరో కొత్త వాదన కూడా వినిపిస్తోంది.తాను అధికారంలోకి వచ్చిన సమయంలో ఏపీ శాసన మండలిలో తమ పార్టీకి అతి తక్కువ బలం ఉండటం.. మండలి ఛైర్మన్ తో సహా.. సభ్యులు సైతం అత్యధికులు టీడీపీకి చెందిన వారు ఉండటం సీఎం జగన్ కు నచ్చలేదు.
అసెంబ్లీలో తాము ఆమోదించి పంపిన నిర్ణయాలకు చెక్ పెడుతూ.. సాంకేతిక అంశాలతో చికాకు పెడుతున్న వైనంతో ఆగ్రహానికి గురైన జగన్మోహన్ రెడ్డి.. ఏపీ మండలిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ అంశంపై ఎవరెన్ని చెప్పినా వినని ఆయన.. ఏపీ అసెంబ్లీలో 133 ఓట్ల బలంతో తీర్మానాన్ని ఆమోదించేసి మండలికి పంపటం.. అక్కడ ఎదురుదెబ్బ తగలటం తెలిసిందే.
దీంతో.. ముందుకు వెళ్లలేక.. వెళ్లే దారి కోసం వెతుకున్న సమయంలో కాలం కరిగిపోయింది. అసెంబ్లీలో తమకున్న బలం కారణంగా.. ఖాళీ అవుతున్న మండలి స్థానాలు వైసీపీ చేతుల్లోకి వచ్చేశాయి. ఇప్పుడు ఏపీ మండలిలో ఉన్న మొత్తం 58 స్థానాలకు అత్యధిక స్థానాలు టీడీపీ చేతుల్లో ఉండటంతో మూడు రాజధానుల బిల్లును వెనక్కి పంపారు. అప్పట్లో దీన్ని సెలక్షన్ కమిటీకి పంపుతూ మండలి నిర్ణయం తీసుకుంది.
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన మొదట్లో మండలిలో తక్కువ బలం ఉన్న వైసీపీకి ఇప్పుడు సంపూర్ణ అధిక్యత ఉంది. ఈ నేపథ్యంలో పెరిగిన బలం నేపథ్యంలో గతంలో మండలి రద్దు కోసం తాము అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ చేసిందని చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే.. త్వరలోనే ఆ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించే వీలుందన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. గతంలో ఆవేశంతోనో.. తొందరపాటుతోనో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకోవటం ద్వారా నష్టనివారణకు జగన్ సర్కారు ప్లాన్ చేస్తుందని చెప్పక తప్పదు.