జగన్ విశాఖ మోజు అలా టీవీ సీరియల్ మాదిరిగా సాగుతోంది. విశాఖ అంటే జగన్ కి ఇష్టం. ఆ విషయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఆరు నెలలలోనే చెప్పేసుకున్నారు. మూడు రాజధానులు అంటూ ఎన్ని చెప్పుకున్నా విశాఖ వంటి రెడీ మేడ్ సిటీని రాజధానిగా చేసుకుని పాలించాలి అన్నదే జగన్ ఆలోచన.
దాంతో పాటు ఎవరో వేసిన విస్తరాకులో భోజనం అన్నట్లుగా తనకు రాజకీయంగా పరమ ప్రత్యర్ధి అయిన చంద్రబాబు సృష్టి అయిన అమరావతి నుంచి పాలన చేయడం జగన్ కి ఏ మాత్రం నచ్చని పని. పైగా అమరావతి అతి పెద్ద స్కాం అని మనసా వాచా జగన్ నమ్ముతున్న నేపధ్యం ఉంది. అందుకే ఆయన చాలా దూకుడుగా మూడు రాజధానులు అంటూ ఒక బిల్లు ని తెచ్చి చట్టం చేశారు.
ఆనాడు జగన్ తాను అనుకుంటే పని సులువు అనే భావించారు. కానీ అమరావతి రైతుల ఎంట్రీ ఉద్యమాలు ఆ మీదట హై కోర్టులో కేసు పడడాలు, చివరికి లోపభూయిష్టంగా మూడు రాజధానుల చట్టం ఉండడం వంటి వాటితో కధ అడ్డం తిరిగింది. ఇక దానితో పాటు హై కోర్టు తీర్పు కూడా అమరావతికే అనుకూలంగా వచ్చింది. దానితో ఏడెనిమిది నెలలు కిమ్మనని జగన్ సర్కార్ ఆ మీదట సుప్రీం కోర్టు తలుపు తట్టింది.
సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో కొన్ని వాలీడ్ పాయింట్స్ ఉన్నాయి. వాటి మీదనే ఇపుడు ఆశలు పెట్టుకుని కాగల కార్యం నడపాలని చూస్తోంది. పాలనాపరమైన వ్యవహారాలలో కోర్టుల జోక్యం ఎంత వరకూ ఏమిటి అన్న దాని మీద కూడా సుప్రీం కోర్టు తీర్పు పూర్తిగా వివరించబఓతోంది. మరో వైపు చూస్తే జగన్ సర్కార్ మూడు రాజధానుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు మీద గంపెడాశలు పెట్టుకుంది.
తీర్పు అనుకూలంగా వస్తే ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా విశాఖకు పాలనా రాజధానిని తీసుకుపోతారు. అంతే కాదు సచివాలయం తరలింపు ఉంటుంది. ఒకవేళ అది కాకపోతే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ని విశాఖకు షిఫ్ట్ చేయడం ద్వారా తాను అనుకునన్ తీరున పాలన అక్కడ నుంచే సాగించాలని జగన్ కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక విశాఖను ఇపుడు ఇంటర్నేషనల్ సిటీగా చూపుతున్నారు. వరసబెట్టి ఫిబ్రవరి మార్చి, ఏప్రిల్ దాకా అనేక అంతర్జాతీయ సదస్సులు విశాఖ వేదికగా జరుగుతున్నాయి. దేశంలో జీ 20 సదస్సులు అన్నీ కూడా ఆయా రాష్ట్రాల రాజధానులలో జరుగుతూంటే ఏపీలో మాత్రం విశాఖలో పెడుతున్నారు. అంటే వైసీపీ ఆలోచనలలో రాజధాని విశాఖ అని చెప్పడమే ముఖ్య ఉద్దేశ్యం.
అదే విధంగా విశాఖ రాజధాని అన్న మాటను ఇంటర్నేషనల్ ప్రతినిధులతో అనిపించడం ఈ సిటీ ప్రాచుర్యం అంతా విశ్వ యవనిక మీద మెరిసిపోవాలని కోరుకోవడం వంటివి కూడా వైసీపీ మార్క్ యాక్షన్ ప్లాన్ లో భాగమే అంటున్నారు. విశాఖలో జరిగే అంతర్జాతీయ ఈవెంట్స్ అన్నీ అదిరిపోవాలని ఇప్పటికే సమీక్ష ద్వారా జగన్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా విశాఖకు రాజధాని తరలింపు అన్నది కూడా ఆయన హింట్ ఇచ్చారు అని అంటున్నారు.
అనీ అనుకూలిస్తే మార్చి నెలాఖరు నుంచి విశాఖ నుంచి పాలన సాగించడానికి రోడ్ మ్యాప్ ని రెడీ చేసి ప్రభుత్వం పెట్టుకుంది అని అంటున్నారు. దానికి ముందు అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరిలో జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాల నాటికి సుప్రీం కోర్టు తీర్పు మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనుకూలంగా తీర్పు వస్తే మూడు రాజధానుల మీద మరోమారు చట్టం చేసి గొప్పగానే విశాఖ దారి పడతారు.
ఒకవేళ కాదు అనుకుంటే కనుక ఎటూ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ తరలింపు ఉంటుంది. దానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. సో జగన్ మాత్రం విశాఖ నుంచి పాలన అంటున్నారు. దానికి ఉగాదికి ముహూర్తంగా పెట్టుకున్నారు అని తెలుస్తోంది. మరో వైపు చూస్తే మంత్రుల క్వార్టర్స్ అన్నీ కూడా విశాఖకే రాబోతున్నాయని అని అంటున్నరు. ఇక మీదట రెగ్యులర్ గా సమీక్షలు కానీ మంత్రి వర్గ సమావేశాలు కానీ టోటల్ గా అన్నీ విశాఖ నుంచే అని అంటున్నారు.
సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుంది అని బలంగా నమ్ముతున్న వైసీపీ ప్రభుత్వం సచివాలయాన్ని 2023 విద్యా సంవత్సరం నుంచి తరలించేందుకు రెడీగా ఉంది అంటున్నారు. ఇక విపక్షాలు అయితే అమరావతికే అనుకూలంగా తీర్పు వస్తుంది అని భావిస్తున్నాయి. తీర్పు సంగతి ఎలా ఉన్నా విపక్షానికి చెక్ చెప్పి మరీ తన పంతం కోరిక నెరవేర్చుకునేందుకు జగన్ విశాఖ లో మకాం పెడతారు అని అంటున్నారు.