రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనంగా మారింది సినీ నటుడు మోహన్ బాబు ఎపిసోడ్. కీలకమైన ఎన్నికల వేళ.. ఏపీ అధికారపక్షం తీరును తప్పు పడుతూ పెద్ద ఎత్తున విద్యార్థులతో ఏపీ ప్రభుత్వ తీరుపై నిరసన ర్యాలీ చేపట్టటం హాట్ టాపిక్ గా మారింది. ఫీజు రీయింబర్స్ మెంట్‌కు సంబంధించి మోహన్ బాబు చేపట్టిన ర్యాలీ ఏపీ అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఇప్పటివరకూ తన ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాల గురించి గొప్పలు చెప్పిన బాబుకు.. మోహన్ బాబు చేసిన నిరసనతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే.. బాబు ప్రభుత్వ తీరును తప్పు పట్టిన మూడు..నాలుగు రోజులకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరుతూ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోహన్ బాబుకు రాజ్యసభ సీటును 2020లో ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
వాస్తవానికి మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ టీడీపీలో చేరాలని భావించారు. కానీ.. విష్ణు సతీమణి వెరొనికా జగన్ కజిన్ కావటం.. ఇలాంటి నేపథ్యంలో లక్ష్మీ కానీ టీడీపీలో చేరితే బాగుండదన్న భావనతో ఆమె పార్టీలో చేరలేదని చెబుతారు. వాస్తవానికి టీడీపీలో మంచు లక్ష్మీ చేరితే వెంకటగిరి అసెంబ్లీ టికెట్ ఆమెకు కేటాయించే వారని చెబుతారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు ఒకప్పుడు ఎంతో సన్నిహితమైన మోహన్ బాబు.. ఈ మధ్యన టీడీపీలో యాక్టివ్ కావాలని భావించినట్లుగా చెబుతారు.
అయితే.. వైఎస్ జగన్ తో ఉన్న బంధుత్వంతో పాటు.. బాబు ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించిన తర్వాతే జగన్ పార్టీలో చేరాలని మోహన్ బాబు నిర్ణయించుకున్నట్లు చెబుతారు. తనకు జగన్ అంటే అభిమానమని.. ఏపీకి కాబోయే సీఎం జగనేనని మోహన్ బాబు చెప్పటం లాంఛనమేనని చెప్పక తప్పదు.