ఏపీ అధికారపక్షం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ అంశాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ డిసైడ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధంపై జాతీయస్థాయిలో పోరాడాలని నిర్ణయించిన జగన్.. ఈ అంశంపై చట్టాన్ని మరింత బలోపేతం చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లోపార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావించటం.. ఫిరాయింపుల చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా తయారు చేయాలన్న వాదనను వినిపించాలని నిర్ణయించింది.
జగన్ ఆలోచన బాగానే ఉంది కానీ.. ఆయన తండ్రి దివంగత మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్.. తండ్రి ఆకస్మిక మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక.. నాటి కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీల నుంచి ఎమ్మెల్యేల్ని తన పార్టీలోకి తీసుకొచ్చే విషయంలో జగన్ అనుసరించిన వైఖరిని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరం. విలువల కోసం పోరాటం చేయటం బాగానే ఉన్నప్పటికీ.. తన తండ్రి.. తాను ఏదైతే చేసి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేశారో.. అదే ప్రయత్నంపై ఇప్పుడు పోరాడటం వల్ల ఫలితం ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో తాను.. తన తండ్రి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ గురించి సూటిగా ప్రశ్నిస్తే జగన్ ఏం సమాధానం చెబుతారు? జాతీయ స్థాయిలో కదిలించి మరీ తిట్టించుకునే ప్రోగ్రామ్ కు జగన్ తెర తీశారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు.