ఉత్కంఠకు తెరపడి ... ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో పాలనా వికేంద్రీకరణ బిల్లుకు చట్టసభ ఆమోదం తెలిపింది. శాసన రాజధానిగా అమరావతి - పరిపాలన రాజధానిగా విశాఖ - న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటు కానున్నాయి. అయితే, ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఆసక్తికరంగా మారింది. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సీఎం జగన్ సవివరంగా తెలిపారు. కులం - ప్రాంతం - దేశం అనే అంశాల ఆధారంగా జగన్ ఆసక్తికరంగా సభా వేదికగా వివరాలు అందించారు.
అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ - కొత్తగా మరో రెండు రాజధానులు ఏర్పాటుచేస్తున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అమరావతికి అన్యాయం చేయడం లేదని - మిగతా ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు. తనకు అన్ని కులాల వారు - మతాల వారు సమానమేనని వివరించారు. చంద్రబాబు చెబుతున్నట్లు అన్నీ ఒకేచోట కేంద్రీకృతం చేస్తూ ఆయన కలల రాజధానిని నిర్మించే ఆర్థిక స్తోమత లేదని - అందువల్లే పాలన - అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామన్నారు. ``కులం మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందడం కోసం జగన్ కమ్మవారికి వ్యతిరేకమని - విజయవాడ నుంచి రాజధానిని తీసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్ని జిల్లాలు - అన్ని ప్రాంతాలు - అన్ని కులాలు - అన్ని మతాలు బాగుండాలన్నదే నా విధానం. నాకు గొప్ప సహచరుడిగా కొడాలి నాని ఉన్నారని నేను గర్వంగా చెబుతున్నా. నా కార్యక్రమాలను చూసే రఘు ఎవరు? వీరంతా కమ్మవారు కాదా? ఇదే కమ్మవారు - కాపులు - ఎస్సీలు - బీసీలు - మైనారిటీలు - రెడ్లు అందరూ ఓటేస్తేనే నాకు 151 సీట్లు వచ్చాయి. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెడితే అక్కడ కమ్మవారు లేరా? అక్కడ మా ఎంపీ కమ్మ వారు కాదా?` అని జగన్ ప్రశ్నించారు.
రాజధాని మధ్యలో ఉండాలని ఎవరూ కొలతలు వేసుకోవాలని ఆలోచించరని జగన్ వెల్లడించారు. రాజధాని మధ్యలో ఉండాలి అనుకొంటే ఢిల్లీని కూడా మార్చాలని న్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు - రామోజీరావు లేఖ రాయాలని జగన్ అన్నారు. పక్క రాష్ట్రమైన తమిళనాడుకు చెన్నై కూడా మధ్యలో లేదని.. మహారాష్ట్రకు ముంబై కూడా లేదని చెప్పారు. జైపూర్ - హైదరాబాద్ కూడా లేవని జగన్ చెప్పారు. ఈ మేరకు సభలో ఫోటోలు కూడా చూపించారు. ``ఢిల్లీకి విజయవాడ మధ్య దూరం 1,856 కిలోమీటర్లు. హైదరాబాద్ 1556 కి.మీ - తిరుపతి 2000 కి.మీ - బెంగళూరు 2177 కి.మీ - చెన్నై 2200 కి.మీ.ల దూరంలో ఉంది. రాజధాని మధ్యలోనే ఉండాలన్నది కరెక్టే అయితే వెంటనే చంద్రబాబు - రామోజీరావు కలిసి రాజధాని మధ్యలో ఉండాలి - దానిని మార్చండి అని మోదీకి లేఖ రాయాలి. తమిళనాడు రాజధాని చెన్నైకి చివరి ప్రాంతం ఎంతదూరంలో ఉందో చూడండి. కర్ణాటక రాజధాని బెంగళూరు - మహారాష్ట్ర రాజధాని ముంబయి ఒక మూలనున్నాయి. రాజస్థాన్ లో జైపూర్ ఎక్కడ ఉందో చూడండి.`` అంటూ నేరుగా చంద్రబాబుకు - మీడియా అధిపతి రామోజీకి ప్రశ్నల వర్షం కురిపించారు.