వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖలో మార్చి 3, 4 తేదీలలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుగా మారుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ నెల 16న ఏపీలో 13 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే ఆ వెంటనే కోడ్ అమలులోకి వస్తుంది. వచ్చే నెలలో వీటి ఎన్నికలు ఫలితాలు అన్నీ పూర్తి అయ్యాక మార్చి 22 తరువాతనే కోడ్ ముగుస్తుంది.
అంటే దాదాపుగా నలభై రోజుల పాటు కోడ్ అమలులో ఉంటుంది అన్న మాట. విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఏపీకి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని కొడా భావిస్తోంది. అదే విధంగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న భారీ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు వెళ్లాయి. అదే విధంగా చూసుకుంటే విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలు, బిగ్ షాట్స్ ఈ సమ్మిట్ లో పాలుపంచుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
అందరికీ ఈ మేరకు ఆహ్వానాలు వెళ్ళాయి. అదే విధంగా దేశంలోని ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలలో కూడా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సదస్సులను కూడా నిర్వహిస్తున్నారు. గత నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగం మీద పెద్దగా దృష్టి సారించలేదని విమర్శలు ఉన్నాయి. పెట్టుబడులు ఆకర్షించకుండా ప్రభుత్వం కేవలం సంక్షేమం మీదనే కధ నడుపుతోంది అన్నది విపక్షాల నుంచి వస్తున్న ఘాటైన ఆరోపణ.
దాంతో ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయనగా విశాఖ నిర్వహించే పెట్టుబడుల సదస్సు ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకట్టుకోవాలని, తమ మీద ఉన్న విమర్శలకు చెక్ చెప్పాలని ప్రభుత్వం చూస్తోంది. అదే టైం లో విశాఖను రాజధానిగా లోకానికి చూపాలని ప్రయత్నం చేస్తోంది. అలా పెట్టుబడుల సదస్సుని విశాఖ రాజధానికి బ్రాండింగ్ కోసం ఉపయోగించుకోవాలని ఆశిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ ఈ పెట్టుబడుల సదస్సుని ప్రతిష్టగా తీసుకున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఇప్పటికే టీడీపీ లీడర్ నారా లోకేష్ పాదయాత్ర నిర్వహించవచ్చా లేదా అన్న దాని మీద ఈసీకి చిత్తూరు జిల్లా కలెక్టర్ లేఖ రాశారు. ఇపుడు పెట్టుబడుల సదస్సు మీద కూడా కోడ్ ప్రభావం పడుతుందా అన్న చర్చ వస్తోంది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలు ప్రముఖులు బిగ్ షాట్స్ వచ్చిన తరువాత అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తరువాత చివరి నిముషంలో ఎన్నికల కోడ్ పేరుతో సదస్సుకు అనుమతి ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది అన్నదే ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉంది అంటున్నారు.
దాంతో ఎన్నికల కోడ్ పెట్టుబడుల సదస్సుకు వర్తిస్తుందా లేదా అన్న దాని మీద క్లారిటీ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి విశాఖ జిల్లా అధికారులు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. మరి పెట్టుబడి సదస్సు అంటే అది అభివృద్ధి కార్యక్రమం కిందకే వస్తుంది కానీ అక్కడ రాజకీయ ప్రసంగాలు అయితే ఉండవు. కానీ ముఖ్యమంత్రి సహా మంత్రులు కీలక అధికార్లు అంతా పాల్గొంటారు.
అయితే ఎలాంటి రాజకీయ ప్రసంగాలు కానీ హామీలు కానీ ఇవ్వకుండా సదస్సు జరుపుకోవచ్చు అని ఈసీ అనుమతిస్తుందని అంటున్నారు. అయితే విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు హామీలు ఇవ్వకుండా ఎలా సదస్సు సాగుతుందని అంటున్నారు. రాష్ట్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుదని వచ్చిన వారికి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలకు ఉంటుంది, అందువల్ల వారు కచ్చితంగా తమ ప్రసంగాలలో రాష్ట్ర అభివృద్ధి గురించి చెబుతారు.
ఇది కనుక ఎన్నికల నిబంధలకు వ్యతిరేకం అవుతుందా లేదా అన్నది చూడాలని అంటున్నారు. ఏ కారణం చేత అయినా ఈ సదస్సు డేట్ మారితే మాత్రం మార్చి నెలలో మళ్ళీ నిర్వహించే చాన్స్ లేదని అంటున్నారు. ఎందుకంటే మార్చి నెలాఖరులో విశాఖలో జీ 20 సదస్సు ఉంది. ఆ తరువాత ఏప్రిల్ లో పెట్టాల్సి ఉంటుంది. అంటే నెల రోజుల పాటు వాయిదా అంటే ఇంత ముందస్తు కసరత్తు చేసిన ఈ సదస్సుకు మళ్లీ ఆ ఊపు తీసుకురావడం జరిగే పనేనా అన్న చర్చ కూడా ఉంది.